Home /News /national /

A WOMAN INFECTED WITH THE KFD VIRUS IS BEING TREATED AT A HOSPITAL IN SHIMOGA KARNATAKA SNR

కర్నాటకలో 57ఏళ్ల మహిళకు సోకిన వింత వైరస్..వామ్మో అలా వ్యాపించిందా

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

KFD VIRUS: వైరస్‌ పాతదే కాని కొత్తగా ఓ కేసు నమోదైంది. కర్నాటకలో మొదలైన కేఎఫ్‌డీ వైరస్‌ ఓ మహిళలో గుర్తించడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరస్‌ సోకిన వాళ్లలో మరణాల రేటు 3నుంచి 5శాతం వరకు ఉంటుందని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
కరోనా, ఒమిక్రాన్‌, ఫ్లురోనా వీటితో పాటు మరో కొత్త రోగం వచ్చి చేరింది. కేఎఫ్‌డీగా గుర్తించిన దీని అసలు పేరు క్యాసనూర్‌ ఫారెస్ట్ డిసీజ్(Kyasanur Forest disease). కర్నాటక(Karnataka)లో ఓ మహిళలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. శివమొగ్గకు (Shimoga) చెందిన మహిళ కొన్ని రోజులుగా అతి జ్వరంతో బాధపడుతోంది. వైద్యులకు చూపించుకొని మందులు వాడినప్పటికి జ్వరం తగ్గకపోవడంతో ఆమె బ్లడ్ శాంపిల్స్‌ (Blood sample)తీసుకొని పరీక్షలకు పంపారు జిల్లా వైద్యాధికారులు. శివమొగ్గ(Shivamogga)లోని ప్రభుత్వాసుపత్రి (Government hospital)లో చేర్చిన అనంతరం ఆమెకు కేఎఫ్‌డీ(KFD)గా గుర్తించినట్లు జిల్లా వైద్యాధికారి (Shivamogga Health Officer) రాజేష్‌ సురగిహళ్లి (Rajesh Suragihalli)తెలిపారు. అయితే ఈ వ్యాధిని మంకీ ఫీవర్‌(Monkey fever)అని కూడా పిలుస్తారని వెల్లడించారు. క్యాసనూర్‌ ఫారెస్ట్‌ డిసిజ్‌ వైరస్‌ వల్ల ఈ వ్యాధి వస్తుందని ప్రకటించారు.కీటకాల ద్వారా వస్తుందని ఎక్కువగా కోతులు(Monkeys),మనుషులపై ప్రభావం చూపుతుందని శివమొగ్గ జిల్లా వైద్యాధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు బాగా చలిజ్వరం,తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయని చెప్పారు. షిమోగాలో క్యాసనూర్‌ ఫారెస్ట్ డిసీజ్‌ సోకిన 57ఏళ్ల మహిళ (Women)కూడా ఇవే సమస్యలతో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు వెల్లడించారు. కేఎఫ్‌డీ వైరస్ సోకిన రోగుల్లో వ్యాధి లక్షణాలు సుమారు 12రోజుల వరకూ ఉంటాయని హెచ్చరించారు. ఇక వైరస్‌ బారినపడ్డ వాళ్లలో కేవలం మూడు నుంచి 5శాతం మాత్రమే మరణాల రేటు ఉంటుందని వెల్లడించారు. ఈ వైరస్‌ ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్లు, తోటల్లో పనులకు వెళ్లే వారే వైరస్‌ బారినపడుతున్నట్లుగా రీసెర్చ్‌లో తేలింది.

కలియుగంలో కొత్త కొత్త రోగాలు..
కర్నాటకలో గుర్తించిన కేఎఫ్‌డీ వైరస్‌ పేను జాతికి చెందిన వ్యాధిగా వైద్యులు వెల్లడించారు. పేను జాతుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది టిక్‌ బర్న్‌ వైరల్‌ హెమరేజిక్ వ్యాధి. ఎక్కువగా మనుషులు, కోతుల్లో కనిపించే ప్రాణాంతక వ్యాధిగా తేల్చారు వైద్యులు. పేలు, నల్లులు, గోమార్లు పశువుల ద్వారా మనుషులకు చేరుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈవైరస్ కీటకాల నుంచి మొదల్కొని జంతువులు అటుపై మనుషుల వరకే చేరుతుందని తేల్చారు. KFDVకి వ్యతిరేకంగా న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను అభివృద్ది చేయడం వల్ల ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచిస్తున్నారు.

కీటకాలతోనే కొంపలు మునుగుతున్నాయి..
కేఎఫ్‌డీ వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలు చూసుకుంటే సుమారు 60సంవత్సరాల క్రితం ఇండియాలోని కర్నాటక రాష్ట్రంలోనే వైరస్‌ బయటపడినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఈ డేంజరస్‌ వైరస్ పాకిపోయింది. ఈమధ్య కాలంలోనే కేఎఫ్‌డీ వైరస్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. వైరస్‌ సోకిన వారిలో 5 నుంచి 10మంది రక్తస్రావ లక్షణాలతోనే చనిపోతున్నారు. గడిచిన ఐదేళ్లలో ఈ వైరస్‌ బారినపడి . 340మంది ప్రాణాలు విడిచారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Karnataka, Virus spread

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు