• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • A WOMAN IN HARYANA WHO HAD TESTED POSITIVE FOR COVID19 DURING HER PREGNANCY GAVE BIRTH TO A COVID19 POSITIVE CHILD SSR GH

Corona: తల్లికి కరోనా.. అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కరోనా.. వైద్యులేమంటున్నారంటే..

Corona: తల్లికి కరోనా.. అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కరోనా.. వైద్యులేమంటున్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

హర్యానా కి చెందిన ఓ మహిళ ప్రసవానికి కొన్ని రోజుల ముందు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నొప్పులు వస్తుండడంతో చాలా ఆసుపత్రులను సంప్రదించి వారంతా ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించడంతో ఆయుష్మాన్ భవ ఆసుపత్రిలో...

  • Share this:
సాధారణంగా గర్భవతులు కరోనా పాజిటివ్ అయినా వారికి పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా పుట్టిన సందర్భాలను గతంలో మనం చూశాం. కరోనా పాజిటివ్ ఉన్న మహిళకు ఎన్నో జాగ్రత్తలతో శస్త్ర చికిత్స చేసి ఆరోగ్యకరమైన బిడ్డను బయటకు తీయడం గతేడాది నుంచి చాలాసార్లే జరిగింది. అయితే హర్యానాలో జరిగిన ఘటన మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హర్యానా కి చెందిన ఓ మహిళ ప్రసవానికి కొన్ని రోజుల ముందు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నొప్పులు వస్తుండడంతో చాలా ఆసుపత్రులను సంప్రదించి వారంతా ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించడంతో ఆయుష్మాన్ భవ ఆసుపత్రిలో చేరింది. గురువారం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ ఆడ, మగ అన్న వివరాలను ఆసుపత్రి వర్గాలు బయటకు వెల్లడించలేదు. కానీ తల్లి నుంచి ఆ బిడ్డకు కూడా కరోనా సోకినట్లు.. కరోనా పాజిటివ్ అయిన ఆ బిడ్డ ఆరోగ్యం ప్రస్తుతం సాధారణంగా ఉన్నట్లు వారు వెల్లడించారు.

ఆ మహిళ భర్తకు ముందు కరోనా సోకింది. దీంతో వెంటనే అతడు ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత పరీక్షలు చేయించుకున్న మహిళకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ప్రసవం కోసం చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ తిరిగినా వారెవరూ ఆమెను చేర్చుకోవడానికి ఆసక్తి చూపించలేదని ఆయుష్మాన్ భవ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

దీని గురించి ఆ ఆసుపత్రికి చెందిన ఓ డాక్టర్ మాట్లాడుతూ ఇలా తల్లి నుంచి కడుపులో ఉన్న బిడ్డకు కరోనా సోకిన మొట్టమొదటి కేసు ఇదేనని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా గర్భిణులు, తల్లులు, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు.

తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకడం అరుదే కానీ అది అసాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా రకాల వైరస్ లో గర్భాశయ పొరలలోకి చొచ్చుకుపోతాయి. గర్భంలోకి కూడా చేరి బిడ్డకు కూడా ఆ ఇన్ఫెక్షన్‌ని కలిగిస్తాయి. గతేడాది ఇటలీలో నిర్వహించిన అధ్యయనాల్లో బొడ్డు పేగు, మాయ నుంచి సేకరించిన శాంపిల్స్‌లో కూడా కొందరిలో కరోనా వైరస్ నిలిచి ఉండడం గమనించారు. కొందరిలో కరోనా వైరస్ యాంటీబాడీలు కూడా తయారవ్వడం గమనించారు. ఇవి తల్లి నుంచి వచ్చే అవకాశాలు లేవని కూడా వారు నిర్ధారించారు. మాయ పొర నుంచి కరోనా లాంటి వైరస్‌లు గర్భంలోకి వెళ్లి బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకేలా చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇది అసాధ్యం మాత్రం కాదు. అని వైద్యులు వెల్లడించడం విశేషం.
Published by:Sambasiva Reddy
First published: