Home /News /national /

A WOMAN BODY IN UTTAR PRADESH WAS TAKEN FOR CREMATION IN A MUNICIPAL GARBAGE VAN SSR

UttarPradesh: చెత్త వాహనమే ఆమెను చివరి మజిలీకి చేర్చింది... ఆమె కరోనాతో చనిపోలేదు.. కానీ..

చెత్త వాహనంలో మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం

చెత్త వాహనంలో మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలామతి అనే 65 సంవత్సరాల వయసున్న వృద్ధురాలు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో యూపీలోని షామ్లీ జిల్లాలో నివాసం ఉండే ఆమె సోదరుడు ప్రభాస్ ఆమెను తన వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆసుపత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించాడు.

ఇంకా చదవండి ...
    షామ్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతోంది. కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆక్సిజన్ అందక కొందరు, ఆసుపత్రుల్లో బెడ్లు లేక మరికొందరు.. పరిస్థితి విషమించి ఇంకొందరు.. ఇలా కారణం ఏదైనప్పటికీ సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా భయం కొందరు మనుషుల్లో కాస్తోకూస్తో ఉన్న మానవత్వాన్ని కూడా చంపేసింది. భయం ముందు ఏ బంధాలైనా వెనక్కి తగ్గడం ఖాయమని రుజువు చేసింది. కాటికి కూడా కనీస గౌరవం లేకుండా కరోనా భయం తరలిపొమ్మంటోంది. ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలామతి అనే 65 సంవత్సరాల వయసున్న వృద్ధురాలు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో యూపీలోని షామ్లీ జిల్లాలో నివాసం ఉండే ఆమె సోదరుడు ప్రభాస్ ఆమెను తన వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆసుపత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించాడు. వైద్య పరీక్షల్లో ఆమె బ్రెయిన్ హేమరేజ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడంతో ఆమె పరిస్థితి విషమించి గత శనివారం సాయంత్రం చనిపోయింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన సోదరి చనిపోవడంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించడం ప్రభాస్‌కు సవాల్‌గా మారింది. ఆమె కరోనాతో చనిపోలేదని.. అనారోగ్యం కారణంగా చనిపోయిందని ప్రభాస్ ఎంత చెప్పినా ఆమె మృతదేహాన్ని స్మశానానికి మోసుకెళ్లేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇరుగుపొరుగును బతిమలాడాడు. ఎవరూ జాలి చూపలేదు.

    ఇక.. దిక్కుతోచని స్థితిలో ప్రభాస్ సర్కార్ మున్సిపాలిటీ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో.. మున్సిపాలిటీ సిబ్బంది ఆమె మృతదేహాన్ని చెత్తను తరలించే వాహనంలో తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఆమె మృతదేహాన్ని తరలిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షామ్లీ జిల్లా మేజిస్ట్రేట్ జస్జిత్ కౌర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నెటిజన్లలో కూడా మిశ్రమ స్పందన వ్యక్తం కావడం గమనార్హం.

    కొందరు ఇరుగుపొరుగు సాయం చేసి ఉండాల్సిందని అభిప్రాయపడితే.. మరికొందరు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికైనా కరోనా భయం ఉంటుందని.. నెట్‌లో కబుర్లు అందరూ చెబుతారని.. కానీ వాళ్లకు ఆ పరిస్థితి ఎదురైతే ఎవరూ ముందుకు వెళ్లరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Corona, Dead body, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు