Home /News /national /

A WIFE WHO GOT UP WITH A BOYFRIEND IF HER HUSBAND WAS IN QUARANTINE IN MADHYA PRADESH BN

ఇంటి పైఅంతస్తులోని గదిలో భర్త క్వారంటైన్‌.. ప్రియుడితో పరారైన భార్య..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నిబంధనల ప్రకారం అతడు తన ఇంట్లోని పైఅంతస్తులో 14 రోజులు క్వారంటైన్ లోకి వెళ్లాడు. దీంతో అతడి భార్యాపిల్లలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మే 24వ తేదీ భార్య ఎవరికీ చెప్పకుండా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

    మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటి పైఅంతస్తులోని గదిలో భర్త క్వారంటైన్‌లో ఉండగా, కింది అంతస్థులో ఉంటున్న భార్య తన ప్రియుడితో కలిసి పరారయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లా ముందేరి గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు. ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో కూలీ పని చేస్తున్నాడు. అతని భార్యా పిల్లలు కూడా ఢిల్లీలోనే ఉండేవారు. అయితే ఏడాదిన్నర క్రితం భార్యాపిల్లలు ముందేరికి తిరిగి వచ్చారు. భర్త ఢిల్లీలోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో అతడు సొంతూరు ముందేరికి రావాలనుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో మే19వ తేదీన ఢిల్లీ నుంచి ఛత్తర్‌పూర్ జిల్లాకు చేరుకున్నారు.

    కరోనా నిబంధనల ప్రకారం అతడు తన ఇంట్లోని పైఅంతస్తులో 14 రోజులు క్వారంటైన్ లోకి వెళ్లాడు. దీంతో అతడి భార్యాపిల్లలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మే 24వ తేదీ భార్య ఎవరికీ చెప్పకుండా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. భర్త ఉన్న గదికి బయటి నుంచి తాళం వేసింది. భర్త గది నుంచి బయటకు వచ్చి భార్య అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Corona virus, Lovers, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు