ఆ గుడిలో ట్రాన్స్‌జెండర్ పూజారి... తరలివస్తున్న భక్తులు...

సాధారణంగా ఆలయాల్లో మగ పూజారులు పూజలు చేస్తారు. కానీ తమిళనాడులోని ఆ ఆలయంలో మాత్రం ట్రాన్స్‌జెండరే పూజారి. ఎందుకో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 3:27 PM IST
ఆ గుడిలో ట్రాన్స్‌జెండర్ పూజారి... తరలివస్తున్న భక్తులు...
ఆ గుడిలో ట్రాన్స్‌జెండర్ పూజారి... తరలివస్తున్న భక్తులు...
Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 3:27 PM IST
చెన్నైలోని ఓల్డ్ వాషర్‌మెన్ పేట్‌లోని MCM గార్డెన్ దగ్గర... కృష్ణుడి ఆలయం ఉంది. అక్కడ ట్రాన్స్‌జెండర్ రవియమ్మాళ్ పూజారిగా చేస్తున్నారు. దాదాపు 15 ఏళ్లుగా అక్కడ పూజలు చేస్తుండటం విశేషం. అసలు ఓ ట్రాన్స్‌జెండర్ పూజలు చేయాలనీ, పూజారి అవ్వాలని ఎందుకు అనుకున్నారు. అందుకు ఓ బలమైన కారణం ఉంది. చిన్నప్పుడు రవియమ్మాళ్... ఓ గుడికి వెళ్లినప్పుడు... అక్కడి పూజారి లోపలికి రానివ్వలేదు. నువ్వు అబ్బాయివీ కాదు... అమ్మాయివీ కాదు... నువ్వు దేవుణ్ని ముట్టుకుంటే అపచారం అంటూ బయటకు పంపేశారు. అప్పటి నుంచీ అదే అంశంపై తీవ్ర ఆవేదన చెందిన రవియమ్మాల్... ఎట్టి పరిస్థితుల్లో తాను పూజారి కావాలని బలంగా నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టే ఆయనకు స్థానికుల నుంచీ మద్దతు లభించింది. దాంతో... పూజారిగా మారిపోయారు.

ఒకప్పుడు శ్రీకృష్ణ ఆలయానికి పెద్దగా భక్తులు వచ్చేవారు కాదు. ఇప్పుడు రవియమ్మాళ్ గురించి అందరికీ తెలుస్తోంది. అలాంటి పూజారి కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతూ కొంతమంది ఆ ఆలయానికి వెళ్తుంటే... ఆయనతో పూజలు చేయించుకుంటే మేలు జరుగుతోందన్న ఉద్దేశంతో మరికొంత మంది అక్కడకు వెళ్తున్నారు. మొత్తంగా ఆలయానికి భక్తుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అమావాశ్య పూజ, పౌర్ణమి పూజ, అష్టమి పూజ ఇలా రకరకాల పూజలు చేస్తూ... బిజీ అయిపోయారు రవియమ్మాళ్.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...