• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • A TRAGIC INCIDENT HAS TAKEN PLACE IN THE RAJKOT MANISHBHAI RAICHURA FAMILY SSR

Corona: ఈ పాపం నిన్ను ఊరికే వదలదు కరోనా.. నువ్వు నాశనం కానూ.. మరీ ఇంత కసాయివా..!

Corona: ఈ పాపం నిన్ను ఊరికే వదలదు కరోనా.. నువ్వు నాశనం కానూ.. మరీ ఇంత కసాయివా..!

మీనాబెన్, మనీష్‌(ఫైల్ ఫొటోలు)

రాజ్‌కోట్‌కు చెందిన మనీష్‌భాయి రాయిచుర కుటుంబంలో కరోనా కలకలం రేపింది. 15 రోజుల క్రితం మనీష్‌కు, అతని తొమ్మిదేళ్ల పాపకు కరోనా లక్షణాలు కనిపించాయి. కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సమరస్ హాస్పిటల్‌లో ఉన్న కోవిడ్-19 వార్డులో చికిత్స తీసుకునేందుకు...

  • Share this:
    రాజ్‌కోట్: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది. అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారి రాజ్‌కోట్‌లోని ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. రెండు రోజుల వ్యవధిలో కరోనా సోకి తల్లీకొడుకు చనిపోయారు. తొమ్మిదేళ్ల వయసున్న ఆ కొడుకు కుమార్తె ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతోంది. తండ్రి, నానమ్మ చనిపోయిన విషయం కూడా ఆ చిన్నారికి తెలియదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్‌కు చెందిన మనీష్‌భాయి రాయిచుర కుటుంబంలో కరోనా కలకలం రేపింది. 15 రోజుల క్రితం మనీష్‌కు, అతని తొమ్మిదేళ్ల పాపకు కరోనా లక్షణాలు కనిపించాయి. కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సమరస్ హాస్పిటల్‌లో ఉన్న కోవిడ్-19 వార్డులో చికిత్స తీసుకునేందుకు మనీష్ పాపతో కలిసి వెళ్లాడు. అయితే.. అక్కడి డాక్టర్ మాత్రం మనీష్‌ను వార్డులో జాయిన్ అవమని చెప్పి, పాప ఇంట్లో ఉండి సెల్ఫ్ ఐసోలేషన్ పాటిస్తే సరిపోతుందని చెప్పాడు. దీంతో.. ఆ పాప ఇంట్లోనే ఉండి క్వారంటైన్ పాటించింది. అయితే.. కొన్నిరోజులకు మనీష్ తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆమె కూడా కొడుకు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే చేరింది. తల్లీకొడుకులిద్దరినీ ఒకే ఫ్లోర్‌లో ఉంచి వైద్యులు చికిత్సనందించారు.

    మనీష్ ఆరోగ్యం కొన్ని రోజులకు కుదుటపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి నుంచే చికిత్స తీసుకున్నాడు. ఆ సమయంలో.. సడన్‌గా ఒకరోజు మనీష్ కూతురు తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో.. వైద్యుల సలహా మేరకు వెంటనే పాపను సివిల్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అయితే.. అదే రోజు మనీష్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించడంతో సివిల్ హాస్పిటల్‌లోనే మనీష్ కూడా చేరాడు.

    ఆరోజు.. మనీష్ కూతురు సౌరాష్ట్రకు ఇంజెక్షన్ ఇచ్చారు. అలా రెండు రోజులు రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఇవ్వడంతో పాప ఆరోగ్యం కొంత మెరుగుపడింది. అయితే.. అంతటితో ఈ కుటుంబాన్ని కరోనా వదల్లేదు. ఏప్రిల్ 11న(ఆదివారం) మనీష్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. మనీష్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో అతనికి వెంటిలేటర్‌ సాయంతో చికిత్సనందించారు. ఈ క్రమంలో.. కరోనా బారిన పడిన మనీష్ తల్లి ఏప్రిల్ 12న ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. వెంటిలేటర్‌పై ఉన్న మనీష్‌కు తల్లి చనిపోయిన విషయం తెలిస్తే ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని భావించిన కుటుంబ సభ్యులు అతనికి విషయం చెప్పలేదు. అయితే.. ఏప్రిల్ 13న ఉదయం మనీష్‌కు రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ తల్లి కరోనా కారణంగా చనిపోయారని ఆ ఫోన్ కాల్‌లో చెప్పారు. బంధువులు విషయం చెప్పకపోయినప్పటికీ ఇలా విషయం మనీష్‌కు తెలిసింది. దీంతో.. వెంటిలేటర్‌పై ఉన్న మనీష్ కంగారుపడ్డాడు. తీవ్ర ఒత్తిడికి లోనై.. కుటుంంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మనీష్‌కు విషయం తెలిసిందని తెలియని కుటుంబ సభ్యులు అతని తల్లి మీనాబెన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేపనిలో నిమగ్నమయ్యారు.

    మీనాబెన్ అంత్యక్రియలు పూర్తి చేసి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెనుదిరిగిన కొద్దిసేపటికే మనీష్ చనిపోయాడని హాస్పిటల్‌ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. తల్లి చనిపోయి.. ఆమె కాష్టం కాలుతుండగానే కొడుకు కూడా చనిపోవడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. నానమ్మ, నాన్నను కరోనా బలితీసుకుందన్న విషయం మనీష్ కూతురికి తెలియదు. ఆ చిట్టి తల్లి కరోనాతో హాస్పిటల్‌లో పోరాడుతోంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు