హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Accident: విషాదం నింపిన విహారయాత్ర..రెండు బస్సులు ఢీ..9 మంది విద్యార్థులు మృతి

Accident: విషాదం నింపిన విహారయాత్ర..రెండు బస్సులు ఢీ..9 మంది విద్యార్థులు మృతి

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, తాగి బండి నడపడం, రాంగ్ రూట్ వంటి కారణాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, తాగి బండి నడపడం, రాంగ్ రూట్ వంటి కారణాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, తాగి బండి నడపడం, రాంగ్ రూట్ వంటి కారణాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Kerala

  దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, తాగి బండి నడపడం, రాంగ్ రూట్ వంటి కారణాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు  బాధిత కుటుంబాల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇక తాజాగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. పాలక్కడ్ జిల్లా వడక్కంచేరి వద్ద గురువారం అర్ధరాత్రి పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ ఊరిస్ట్ బస్సు, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడగా..12 మంది పరిస్థితి విషమంగా మారింది.

  దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్నకూలం జిల్లా మూలంతిరుతిలోని  ఓ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు బస్సులో విహారయాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు వడక్కంచేరి వద్ద కోయంబత్తూరు వెళ్తున్న కెఎస్ఆర్టీసీ బస్సును  వెనక నుంచి ఢీకొట్టింది. దీనితో విద్యార్థులు ఉన్న బస్సు రోడ్డు ప్రక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీనితో 9 మంది అక్కడిక్కక్కడే మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడగా..12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.  సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  అప్పటివరకు సరదాగా గడిపిన ఆ విద్యార్థులు జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా వులిక్కిపడ్డారు. ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. తమ తోటి మిత్రులు చనిపోవడంతో విద్యార్థులు బోరున విలపించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు అందరూ టూరిస్ట్ బస్సులో ఊటీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం అనంతరం మంటలు అంటుకుంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని అధికారులు వెల్లడించారు.

  ప్రమాదానికి కారణం ఏంటి?

  టూరిస్ట్ బస్సులో బెసిలియాస్ స్కూల్ విద్యార్థులు విహారయాత్రకు బయలుదేరారు. అప్పటివరకు అంతా సక్రమంగా ఉన్నా డ్రైవర్ అతి వేగంగా బస్సును నడపడమే కారణం అని తెలుస్తుంది. అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు మిగతా విద్యార్థులు చెప్పుకొచ్చారు. ప్రమాద తీవ్రతకు వర్షం కూడా ఓ కారణంగా తెలుస్తుంది. వర్షం పడడంతో రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ చూడలేకపోయాడు. ఇక హై స్పీడ్ లో బస్సు ఉండడంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయారు.

  Published by:Rajashekar Konda
  First published:

  ఉత్తమ కథలు