కరోనా (corona) ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మందిని కోవిడ్ బలి తీసుకుంది. చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోయాయి. పలు దేశాలు లాక్డౌన్ (lockdown)లను విధించాయి. కరోనా రెండో వేవ్ (Corona Second wave) చాలా దేశాల్లో వచ్చింది. ఇక మూడో వేవ్ వస్తుందేమో అని ఇప్పటికే పలు దేశాలు ఆందోళనగా ఉన్నాయి. కాగా, కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికే మూడో వేవ్ రాగా.. అక్కడ కరోనా నాలుగో వేవ్ కూడా తలుపుతడుతోంది. అయితే భారత్‌లో మాత్రం కరోనా రెండో (corona) దశ ఉధృతి అనంతరం మెల్లమెల్లగా అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. ఇందులో భాగంగా విద్యారంగం కూడా క్రమంగా గాడిన పడుతోంది. కొన్ని చోట్ల ఆన్లైన్ తరగతులు (Online classes) కూడా నిర్వహిస్తున్నా చాలావరకు పాఠశాలలు (schools) ప్రారంభమయ్యాయి. అయితే కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ.. మహమ్మారి మాత్రం విద్యార్థులను (students), ఉపాధ్యాయులను వెంటాడుతూనే ఉంది.
కర్ణాటకలోని ధార్వాడ్ మెడికల్ కాలేజీ (Dharwad Medical College)లో జరిగిన కళాశాల ఈవెంట్ మొత్తం రాష్ట్రాన్నే కుదిపేసింది. కార్యక్రమం అనంతరం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొదటిరోజే దాదాపు 60కిపైగా పాజిటివ్ కేసులు (SDM covid cases) బయటపడ్డాయి. ఇక ఇపుడు ఆ కళాశాలలో కరోనా సోకిన వారి సంఖ్య 182కు పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలేజీలోని మొత్తం సిబ్బంది, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా.. వైరస్ బారిన పడినవారిలో చాలా మంది టీకా రెండు డోసులు తీసుకున్నవారే కావడంతో వారందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తున్నాయని తెలిపారు.
ఏ జరిగింది?
ఎస్డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SDM College of Medical Sciences)లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం కళాశాలలోని దాదాపు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 66 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మరో 100 మందికి పైగా విద్యార్థులకు టెస్టు ఫలితాలు శుక్రవారం వచ్చాయి. దీంతో ఇప్పటివరకు కాలేజీలో 182 మంది కరోనా బారినపడినట్లు (SDM covid cases) అధికారులు తెలిపారు. నవంబరు 17న కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ (freshers party) జరిగింది. ఈ వేడుకలతోనే వైరస్ వ్యాప్తి జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్..
వైరస్ సోకిన వారిలో చాలా మంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ (Already two doses of vaccine) తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరంతా క్యాంపస్ హాస్టళ్లలోనే క్వారంటైన్లో ఉన్నారు. వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. వీరి రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఈ కాలేజీలో మొత్తం 3000 వరకు విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. వీరందరికీ వైరస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరి ఫలితాలు రావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Covid cases, Freshers, Karnataka, Medical college