• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • A SECOND MARRIED MAN AFTER THE BIRTH OF HIS WIFE WHO DID NOT RETURN IN BIHAR

లాక్‌డౌన్ వేళ భార్య పుట్టింట్లో.. తిరిగి రాలేదని మాజీ ప్రియురాలిని రెండో వివాహం

లాక్‌డౌన్ వేళ భార్య పుట్టింట్లో.. తిరిగి రాలేదని మాజీ ప్రియురాలిని రెండో వివాహం

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండడం.. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భర్త దగ్గరకు చేరుకోలేకపోయింది. దీంతో ధీరజ్ కుమార్ భార్యపై కోపంతో తన మాజీ ప్రియురాలిని రెండో వివాహం చేసుకున్నాడు.

  • Share this:
    ఓ వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో లాక్‌డౌన్ నిబంధనల వల్ల భర్త దగ్గరికి తిరిగిరాలేకపోయింది. దీంతో ఆగ్రహించిన భర్త తన మాజీ ప్రియురాలిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దుల్హిన్ బజారుకు చెందిన ఓ యువతికి పాలీగంజ్‌కు చెందిన ధీరజ్‌కుమార్‌తో కొన్ని నెలల క్రితం వివాహమయ్యింది. లాక్‌డౌన్‌కు ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం లాక్‌డౌన్ నిబంధనలు అమలులోకి రావడంతో ఆమె పుట్టింటి వద్దే ఇరుక్కపోయింది. ఆమె భర్త పలుమార్లు కాల్ చేసి ఇంటికి రావాలని కోరాడు. లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండడం.. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భర్త దగ్గరకు చేరుకోలేకపోయింది. దీంతో ధీరజ్ కుమార్ భార్యపై కోపంతో తన మాజీ ప్రియురాలిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు