Home /News /national /

A RARE RESPECT FOR THE TELUGU LANGUAGE THE DECISION TO TEACH IN THAT STATE TEACHERS WHO ARE IN SHOCK UMG GH

Punjab Schools: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!

 తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. షాక్ కు గురవతున్న టీచర్లు! (Image: Shutter Stock)

తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. షాక్ కు గురవతున్న టీచర్లు! (Image: Shutter Stock)

పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు తెలుగు (Telugu) భాష నేర్పించాలని ముక్త్‌సర్‌ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) వింత దేశాలు జారీ చేశారు. “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (Azadi Ka Amrit Mahotsav)” ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తెలుగు నేర్పించాలని ఉపాధ్యాయులకు తాజాగా ఒక షెడ్యూల్‌ను జారీ చేశారు.

ఇంకా చదవండి ...
తమిళనాడు(Tamilnadu)లో తమిళం, కర్ణాటక(Karnataka)లో కన్నడ, తెలుగు(Telugu) రాష్ట్రాల్లో తెలుగు భాషను విద్యార్థులకు బోధించడం సాధారణమైన విషయం. అయితే తాజాగా పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు తెలుగు (Telugu) భాష నేర్పించాలని ముక్త్‌సర్‌ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) వింత దేశాలు జారీ చేశారు. “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (Azadi Ka Amrit Mahotsav)” ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తెలుగు నేర్పించాలని ఉపాధ్యాయులకు తాజాగా ఒక షెడ్యూల్‌ను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ భాష, సంస్కృతి, క్రీడలు, నృత్యాలపై వ్యాసరచన పోటీలు తెలుగులో నిర్వహించాలని, ఈ రాష్ట్రంలో బాగా ఉపయోగించే పదాలను తెలుగు భాషలో బోధించాలని ఆయన సూచించారు. దీంతో "ఇదెక్కడి నిర్ణయం, అసలు మాకు తెలుగే రాదు, అలాంటప్పుడు ఎలా బోధించాలి?" అని ప్రభుత్వ ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.

పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్‌లో జులై, ఆగస్టు నెలల్లో పాఠశాల, క్లస్టర్, బ్లాక్, జిల్లా స్థాయిలలో తెలుగులో పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించడం ఇప్పుడు ఆ టీచర్లకు అసలు మింగుడుపడటం లేదు. "భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించినది కాబట్టి విద్యార్థులకు తెలుగు నేర్పించడం వల్ల ఎలాంటి నష్టం లేదు, కానీ చాలా మంది పంజాబీ భాషలో కూడా ఫెయిల్ అవుతున్నారు. వారికి మొదటగా పంజాబీ భాష నేర్పించడం ముఖ్యం. ఇతర రాష్ట్రాల గురించి కాకుండా సొంత రాష్ట్రమైన పంజాబీ సంస్కృతి, సంప్రదాయాలు, కళల గురించి చెప్పడం అవసరం" అని టీచర్లు డీఈవో ఆదేశాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘భాషా సీఖో ప్రోగ్రామ్’ కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రజల రోజువారీ జీవితం, క్రీడలు, ధరించే దుస్తుల గురించి పంజాబ్‌ విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని.. ఈ అంశాలపై పోటీలు సైతం నిర్వహించాలని ఉపాధ్యాయులను డీఈవో ఆదేశించారు. విద్యార్థులకు ఏపీలోని సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ ఇప్పించి పోటీలు నిర్వహించాలని కూడా ఉపాధ్యాయులను కోరారు. క్లస్టర్ స్థాయి పోటీల అనంతరం ఆగస్టు 22, 29 తేదీల్లో బ్లాక్, జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:  Russia-Ukraine War: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..? ఇవిగో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?


దీంతో సీనియర్ టీచర్లు కూడా ఫైర్ అవుతున్నారు. "విద్యార్థులను బలవంతంగా తెలుగు చదవమని కాకుండా స్థానిక లేదా ప్రాంతీయ భాషలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఇది ఆచరణ సాధ్యం కాని నిర్ణయం. ఇంకా, మాకే ఈ భాష తెలియనప్పుడు, దానిని విద్యార్థులకు ఎలా నేర్పించగలం?" అని ప్రశ్నిస్తున్నారు. “ఈ నిర్ణయం వల్ల ఒరిగేదేమీ లేదు, సమయం వృధాగా గడిచిపోవడం తప్ప. ఉపాధ్యాయులు ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు కుస్తీలు పడుతున్నారు". అని ఒక టీచర్ పేర్కొన్నారు.



ఈ క్రమంలోనే ముక్త్‌సర్‌ డీఈవో మల్కిత్ సింగ్ స్పందించారు. “పంజాబ్‌లోని పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల డైరెక్టర్-కమ్-సెక్రటరీ ద్వారా ఒక లేఖ జారీ అయింది. ఈ లేఖలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి డైరెక్టర్-కమ్-సెక్రటరీలకు తెలియజేశారు. ‘భాషా సీఖో ప్రోగ్రామ్ కింద పంజాబ్‌కు జత చేసిన రాష్ట్రమైన ఏపీలో మాట్లాడే 100 వాక్యాలను నేర్చుకోవాలి’ అని స్పష్టంగా పేర్కొన్నారు. అవే ఆదేశాలను నేను స్కూల్ హెడ్స్‌కి సర్క్యులేట్ చేశాను. ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు" అని మల్కిత్ సింగ్ పేర్కొన్నారు.
Published by:Mahesh
First published:

Tags: AAP, Azadi Ka Amrit Mahotsav, Punjab, Telugu language

తదుపరి వార్తలు