A PRISONER WHO DIED AFTER DRINKING A SANITIZER THAT SMELLED OF ALCOHOL IN KERALA BN
ఖైదీ ప్రాణం తీసిన శానిటైజర్.. అసలు ఏం జరిగిందంటే..?
ప్రతీకాత్మక చిత్రం
వాస్తవానికి జైలు అధికారులు హ్యాండ్ శానిటైజర్ తయారీలో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌ను వినియోగిస్తారు. దాన్ని ఆల్కహాల్ అనుకుని తాగడంతో కేరళలోని పాలక్కాడ్‌లో ఖైదీ మృతిచెందాడు.
ఓ ఖైదీ ఆల్కహాల్ అనుకుని శానిటైజర్‌ను తాగాడు. అనంతరం కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఖైదీ మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని పాలక్కాడ్‌లోని జైలులో రామన్ కుట్టి ఫిబ్రవరి 18 నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ప్రస్తుతం శానిటైజర్లకు డిమాండ్ భారీగా ఏర్పడింది. వాస్తవంగా జైలులోని ఖైదీలతో రాష్ట్ర ప్రభుత్వం శానిటైజర్లను తయారు చేయిస్తోంది. అయితే రామన్ కుట్టి గురువారం ఉన్నట్టుండి కళ్లుతిరిగి కిందపడిపోయాడు. జైలు అధికారులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
చికిత్స చేసే క్రమంలో వైద్యులు వ్యక్తం చేసిన అనుమానంతో అది విన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగి ఉంటాడని, దానివల్లే ఇలా జరిగిందని జైలు అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి జైలు అధికారులు హ్యాండ్ శానిటైజర్ తయారీలో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌ను వినియోగిస్తారు. దీంతో గత గురువారం రామన్ కుట్టి జైలులోని సదరు శానిటైజర్‌కు వినియోగించే పదార్థాన్ని రామన్ కుట్టి తాగి ఉంటాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మంగళవారం రాత్రి వరకు రామన్ ఆరోగ్యం సాధారణంగానే ఉంది. బుధవారం సైతం రోల్ కాల్ కోసం హాజరయ్యాడు. కానీ గురువారం కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.