• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • A PREGNANT SPERM WHALE WHICH WASHED UP ON THE ITALIAN COAST HAD 49LBS OF PLASTIC DEBRIS IN ITS STOMACH SB

ప్రెగ్నెంట్ తిమింగలం కడుపులో ప్లాస్టిక్... 22 కిలోల వ్యర్థపదార్థాలు

ప్రెగ్నెంట్ తిమింగలం కడుపులో ప్లాస్టిక్... 22 కిలోల వ్యర్థపదార్థాలు

ప్రతీకాత్మక చిత్రం

సముద్రంలో భారీ ఎత్తున ప్లాస్టిక్ వ్యార్థలైన బాటిళ్లు, ప్లాస్టిక్ వలలు, ప్లాస్టిక్ కవర్లు తినే సముద్ర జీవులు చనిపోతున్నాయని చెబుతున్నారు.

  • Share this:
    ప్లాస్టిక్ మూగజీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్ జల వాయు కాలుష్యాలకు కారణమవుతుండటతో జంతువుల ప్రాణాలు సైతం హరించివేస్తోంది. తాజాగా ఓ భారీ తిమింగలం ప్లాస్టిక్ తిని చనిపోయింది. అది గర్భవతి కూడా కావడంతో దాని కడుపులో మృతిచెందిన పిండంతో పాటు.. ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిస్టులు గుర్తించారు. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటలీ తీర ప్రాంతానికి అతిపెద్ద తిమింగలం కొట్టుకొచ్చింది. అది చనిపోవడంతో తిమింగలాన్ని పోస్టుమార్టమ్ నిర్వహించిన సైంటిస్టులు షాక్ అయ్యారు. ప్రెగ్నెంట్ అయిన ఈ భారీ తిమింగలం కడుపులో 22 కిలోల అంటే సుమారు 49 పౌండ్లు ప్లాస్టిక్‌ను కనుగొన్నారు.

    ఈ ఘటనపై అక్కడ పర్యావరణ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సముద్రంలో భారీ ఎత్తున ప్లాస్టిక్ వ్యార్థలైన బాటిళ్లు, ప్లాస్టిక్ వలలు, ప్లాస్టిక్ కవర్లు తినే సముద్ర జీవులు చనిపోతున్నాయని చెబుతున్నారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆడ తిమింగలం కడుపులో పిండం కూడా ప్రారంభదశలో ఉందన్నారు. ప్లాస్టిక్ తినడం వల్ల డాల్ఫిన్ల జీర్ణ వ్యవస్థ పాడైపోయి అవి చనిపోతున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు తినే చేపల్ని మనుషులు తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.

    వైద్య నిపుణులు అంచనా ప్రకారం తాజాగా చనిపోయిన తిమింగలం... కడుపులో ప్లాస్టిక్ పేరుకుపోయిన కారణంగానే అది ఏమీ తినలేని పరిస్థితికి చేరింది. అందుకే అనారోగ్యంపాలై మృతి చెందని తెలిపారు. నదులు..సముద్రాలు ప్లాస్టిక్ వల్ల కాలుష్య కాసారాలుగా మారుతున్నాయనటానికి ఈ తిమింగలం మృతే ఉదాహరణ అంటున్నారు పర్యావరణ వేత్తలు. గత పదేళ్లలో చనిపోయిన 61 డాల్ఫిన్లు, తిమింగలాలకు పోస్టుమార్టం నిర్వహించగా వాటి మృతికి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమని వైద్య అధికారులు తెలిపారు. ఇంతకు ముందు కూడా ఇలా ప్లాస్టిక్ తిని ఇలా తిమింగళాలు చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా కాలుష్యంపైనా..ప్లాస్టిక్ నిషేధంపైనా కఠిన చర్యలు తీసుకోవాలనీ..లేకుంటే మరిన్ని మూగజీవాలు బలైపోయే ప్రమాదముందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
    First published: