హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అయ్యో పాపం.. 5వేల మందికి తన చేతులతో పురుడుపోసిన నర్సు.. తన డెలివరీకే ప్రాణాలు కోల్పోయిందే...

అయ్యో పాపం.. 5వేల మందికి తన చేతులతో పురుడుపోసిన నర్సు.. తన డెలివరీకే ప్రాణాలు కోల్పోయిందే...

జ్యోతి (ఫైల్ ఫోటో)

జ్యోతి (ఫైల్ ఫోటో)

జ్యోతి ప్రసవం కోసం నవంబర్ 2న హింగోలిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సీజర్ ద్వారా ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతుడైన కుమారుడికి జన్మనిచ్చింది.

మహారాష్ట్ర: భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు ఇలా జరుగుతుందని ఎవరూ కలలో కూడా ఊహించరు. కానీ ఊహించనిది జరగడమే విధి. అలాంటి ఓ ఘటన మహారాష్ట్రలోని హింగోలిలో వెలుగు చూసింది. ఇక్కడ ఒక నర్సు గత 5 సంవత్సరాలలో సుమారు 5000 వేల మంది గర్భిణులు ప్రసవించేందుకు సహాయపడింది. అయితే విధి వక్రించడంతో ఆమె.. తన ప్రసవ సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా మరణించింది. వివరాల్లోకి వెళితే.. జ్యోతి గావ్లీ అనే 38 ఏళ్ల మహిళా నర్సు గత ఐదేళ్లలో సుమారు 5,000 మంది శిశువులను ప్రసవించడంలో సహాయం చేసింది. హింగోలిలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగంలో 38 ఏళ్ల జ్యోతి గావ్లీ గత ఐదేళ్లుగా నర్సుగా పని చేసింది.

అంతకుముందు ఆమె గోరేగావ్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేసింది. మహారాష్ట్రలోని హింగోలిలోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తూ.. నర్సుగా సుమారు 5 వేల మంది పిల్లల ప్రసవానికి సాయం చేసింది. నార్మల్ డెలివరీతో పాటు సిజేరియన్ డెలివరీ సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో నర్సు కీలక పాత్ర పోషించారు. అలాంటి అనుభవజ్ఞురాలైన నర్సు జ్యోతి గావ్లీ ప్రసవ సమయంలో మరణించడం చాలామందిని కలిచివేసింది. ప్రసవం కోసం తాను పని చేసే ఆస్పత్రికి వచ్చే మహిళలతో జ్యోతి గావ్లీ తొందరగా కలిసిపోయేది. ప్రసవం సమయంలో ఉండే అపోహలు, భయాలను తొలగించడంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఈ రకంగా జరగడం చాలామందిని భావిస్తోంది.

జ్యోతి ప్రసవం కోసం నవంబర్ 2న హింగోలిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సీజర్ ద్వారా ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతుడైన కుమారుడికి జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత జ్యోతి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. ప్రసవం తర్వాత రక్తస్రావం ఆగకపోవడంతో వెంటనే మరో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జ్యోతికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారింది. దీంతో తదుపరి చికిత్స కోసం ఔరంగాబాద్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..

Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి

అయితే జ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సలో జ్యోతి ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల కనిపించింది. అయితే ఉన్నట్టుండి ఆదివారం ఉదయం అతనికి మళ్లీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. పరిస్థితి విషమించడంతో జ్యోతి మరణించింది. నర్సుగా ఎంతో మంది బిడ్డలను వారి కుటుంబసభ్యులు, తల్లుల చేతిలో పెట్టిన నర్సు జ్యోతి గావ్లీ.. తనకు పుట్టిన బిడ్డను మాత్రం చేతుల్లోకి తీసుకోకుండా చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయమే.

First published:

Tags: Tragedy

ఉత్తమ కథలు