Home /News /national /

A NEW SPECIES OF CRAB DWIVARNA HAS BEEN DISCOVERED IN UTTARA KANNADA DISTRICT AND IT IS ENDEMIC TO YELLAPUR GH SRD

New Crab Species: కర్ణాటకలో కొత్తరకం పీత జాతి.. ప్రత్యేకతలు ఇవే.. దీని పేరు ఏంటంటే..

Photo Credit : Gopal Krishna Hegde and  Parashuram Bhajantri

Photo Credit : Gopal Krishna Hegde and Parashuram Bhajantri

New Crab Species: కర్ణాటకలోని ఎల్లాపూర్‌లో ఒక కొత్త జాతి పీత (New crab species) వెలుగులోకి వచ్చింది. 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉన్న ఈ పీత రెండు రంగులలో ఉండి ఆకట్టుకుంటోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
భూ ప్రపంచంలో మనిషికి తెలియని కొత్త జాతి జీవులు ఎన్నో దాగున్నాయి. వాటన్నిటినీ శాస్త్రవేత్తల్లో వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకలోని ఎల్లాపూర్‌లో ఒక కొత్త జాతి పీత (New crab species) వెలుగులోకి వచ్చింది. 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉన్న ఈ పీత రెండు రంగులలో ఉండి ఆకట్టుకుంటోంది. ఉత్తర కన్నడ జిల్లాలో కనిపించిన ఈ పీతకు 'ద్వివర్ణ (Dwivarna)' అని నామకరణం చేశారు. మన భారతదేశంలో ఇప్పటివరకు కనిపెట్టిన 75వ పీత జాతిగా ద్వివర్ణ నిలుస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 75వ నిండిన సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీనే ఈ 75వ జాతి పీతకు శాస్త్రీయంగా అంగీకారం లభించడం విశేషం.

గతేడాది జూన్ 30న భారే అడవుల గుండా ప్రయాణిస్తున్న ఇద్దరు సామాన్యులు ఈ కొత్త జాతి పీతను కనిపెట్టారు. వారే ఎల్లాపూర్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ గోపాల్ కృష్ణ హెగ్డే, కద్రా ఫారెస్ట్ గార్డ్ పరశురాం భజంత్రీ. ఈ మంచినీటి పీత చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో వారు చాలా ఆశ్చర్యపోయారు. అనంతరం దీనిని శాస్త్రవేత్తల దృష్టికి తీసుకువచ్చారు. అలా దీనిని కనుగొన్న ఒక ఏడాది తర్వాత ఘటియానా ద్వివర్ణ (డైక్రోమాటిక్) అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇది రెండు రంగులలో ఉంది. ఈ పీత తల తెలుపు రంగులో ఉంటే దాని శరీరం ఊదారంగులో ఉంది.

ద్వివర్ణ పీతలు తినదగినవని కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి నాచు, లైకెన్‌లపై మనుగడ సాగిస్తాయి. డ్యూయల్-టోన్ కలిగిన ఈ పీత పశ్చిమ కనుమలలోని రాతి క్రస్ట్‌లో నీటి వనరుల మధ్య నివసిస్తుందని స్థానికులు తెలిపారు. ఇది అత్యంత ప్రత్యేకమైన పీతలలో ఒకటని హెగ్డే అన్నారు. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీనిని ఒక ప్రత్యేకమైన జాతిగా నిర్ధారించింది. దాంతో హెగ్డే, భజంత్రీలకు ‘సిటిజన్ సైంటిస్ట్స్’ అనే బిరుదు లభించింది.

ఇది కూడా చదవండి : వారెవ్వా కన్నీళ్లను ఉపయోగించి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు.. ఎలాగంటే..

“ఇలాంటి రంగురంగుల పీతను ఇంతకు ముందెన్నడూ చూడలేదని మేం ఆశ్చర్యపోయాం. ఇది ఆసక్తికరంగా ఉందని మేం భావించాం. వెంటనే కొన్ని ఫొటోలు, వీడియోలను తీసుకున్నాం. ఇలాంటి పీతల గురించి మేం గూగుల్‌లో వెతకడం ప్రారంభించినప్పుడు, మాకు ఏ సమాచారం దొరకలేదు” అని హెగ్డే తెలిపారు. చివరికి ఇది కొత్త పీత జాతి కావచ్చునని ఇద్దరూ భావించారు.

ఈ విషయాన్ని వెరిఫై చేసుకోవడానికి వారు రిలయన్స్ ఫౌండేషన్‌కు నాయకత్వం వహిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వరదగిరిని సంప్రదించారు. వరదగిరి ఇంతకు ముందు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో పనిచేశారు. ఆ అనుభవంతో దీనిని పరిశీలించిన ఆయన ఇది కొత్త జాతి కావచ్చునని అభిప్రాయపడ్డారు. మరింత సమాచారం కోసం పీతలపై ప్రత్యేకత కలిగిన శాస్త్రవేత్త, ఠాక్రే ఫౌండేషన్‌కు చెందిన తేజస్ థాక్రేని, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సమీర్ కుమార్ పతిలను సంప్రదించాల్సిందిగా సూచించారు.

హెగ్డే, భజంత్రీలు ఆయన చెప్పినట్లుగానే సమీర్ కుమార్‌ను కలిశారు. కొత్త పీత గురించి తెలుసుకున్న ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాలను నిర్ధారించుకోవడానికి వ్యక్తిగతంగా ఎల్లాపూర్‌కు వెళ్లారు. ఆపై అతను దానిని కనుగొన్నారు. తర్వాత అతను ఒక సైంటిఫిక్ పేపర్ రాయగా.. అది హెగ్డే, భజంత్రీల పేర్లతో ప్రచురితమయ్యాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Karnataka, National News, Trending news, VIRAL NEWS

తదుపరి వార్తలు