హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi restaurant: ఢిల్లీ రెస్టారెంట్​ నిర్వాకం.. చీర కట్టుకుందని మహిళకు నో ఎంట్రీ.. నెటిజన్ల ఆగ్రహం

Delhi restaurant: ఢిల్లీ రెస్టారెంట్​ నిర్వాకం.. చీర కట్టుకుందని మహిళకు నో ఎంట్రీ.. నెటిజన్ల ఆగ్రహం

చీర కట్టుకొని వచ్చిందని రెస్టారెంట్‌లోకి అనుమతించని యాజమాన్యం (PC: ANI)

చీర కట్టుకొని వచ్చిందని రెస్టారెంట్‌లోకి అనుమతించని యాజమాన్యం (PC: ANI)

దేశ రాజధాని ఢిల్లీలో అక్విలా అనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కొన్ని పద్ధతులను పెట్టుకుంది. సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చే వారిని అనుమతించడం లేదు.

భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. మన ఆచారాలు, కట్టుబొట్టు చూసే ప్రపంచ దేశాలన్నీ మనల్ని గౌరవిస్తుంటాయి. ప్రత్యేకించి ఇక్కడి మహిళల చీరకట్టును ప్రపంచ నారీమణులు ప్రశంసిస్తుంటారు. విదేశీ మహిళలు సైతం చీర కట్టులో మెరిసిపోవాలని తహతహలాడుతుంటారు. అటువంటి చీరకట్టును వద్దంటోంది ఢిల్లీలోని (Delhi)రెస్టారెంట్​ (Restaurant). శారీ (Saree) వేర్​లో తమ రెస్టారెంట్​కు వచ్చే వారిని అనుమతించమని చెబుతోంది. ఈ నిబంధనపై నెటిజన్లు (Netizens) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు రెస్టారెంట్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో అక్విలా అనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కొన్ని పద్ధతులను పెట్టుకుంది. సంప్రదాయమైన వస్త్రధారణ ఉన్న వారినే అనుమతిస్తామని నిబంధన పెట్టింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. వారి సంప్రదాయమైన వస్త్రధారణ జాబితాలో చీరను జోడించలేదు. అదే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. తాజాగా ఓ జర్నలిస్ట్​ చీర కట్టుతో రెస్టారెంట్​కు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు.

దీంతో చీర కట్టులో ఉన్న వారిని ఎందుకు అనుమతించట్లేదని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. దానికి వారు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. చీరను​ స్మార్ట్​ క్యాజువల్​ వేర్​గా పరిగణించలేమని చెప్పుకొచ్చారు. దీంతో అవాక్కైన సదరు మహిళ ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు రెస్టారెంట్​ను ఏకిపారేస్తున్నారు. ఇటువంటి చెత్త నిబంధనలు పెట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘చీర స్మార్ట్ వేర్ కాదని ఎవరు నిర్ణయించారు? నేను అమెరికా, యుఏఈ, యుకెలోని అనేక టాప్​ రెస్టారెంట్లకు సైతం చీరకట్టులోనే వెళ్లాను. అక్కడ నన్ను ఎవరూ అడ్డుకోలేదు సరకదా వారు నన్ను అమితంగా గౌరవించారు. విదేశీయులు సైతం మన చీరకట్టును ప్రశంసిస్తుంటే ఇక్కడ దీనికి భిన్నంగా వ్యవహరించడం ఆశ్చర్యకరం’ అని తన ఆవేదన వ్యక్తం చేసింది.

మరొక నెటిజన్​ వ్యాఖ్యానిస్తూ 'చీరను స్మార్ట్​వేర్​ కాదనడం వారి సంకుచిత మనస్తత్వానికి ప్రతీక. ఈ రెస్టారెంట్ మహిళలను కేవలం చిరిగిన బట్టలు, పొట్టి డ్రెస్సులు ధరించాలని కోరుకుంటుందా?” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘చీర కట్టుతో ఉన్న మహిళను రెస్టారెంట్‌లోకి అనుమతించకపోవడం భారతీయ సంస్కృతిపై ప్రత్యక్ష దాడి తప్ప మరొకటి కాదు. ఇది తాలిబనీ మనస్తత్వం కాదా?’’ అని మరో యూజర్ ప్రశ్నించారు.

* తాలిబనీ మనస్తత్వం అంటూ నెటిజన్ల ఆగ్రహం..

సాధారణ నెటిజన్లతో పాటు సెలబ్రెటీలు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు. నటి రిచా చద్దా కూడా ట్విట్టర్‌లో తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ట్వీట్ చేస్తూ 'ఇది- మన సంప్రదాయాలను అవమానపరచడమే. మన స్వంత భాష, కట్టుబొట్టుపై చిన్నచూపు చూడటం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. జరిగిన దానికి సదరు రెస్టారెంట్​ క్షమాపణ చెప్పాల్సిందే.” అని #SariNotSorry అనే ట్యాగ్​లైన్​ జోడించి ట్వీట్​ చేశారు. బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా జోనాస్ సోదరి నటి మీరా చోప్రా కూడా ఈ విషయంపై స్పందించింది. ఇది భారతీయ సంస్కృతిని చిన్నచూపు చూసే రెస్టారెంట్​ను బహిష్కరించాలని ప్రజలను కోరింది. అంతేకాదు, ప్రభుత్వం ఈ రెస్టారెంట్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది.

Published by:John Kora
First published:

Tags: VIRAL NEWS

ఉత్తమ కథలు