Home /News /national /

A MUSLIM BRIDE WHO SET A NEW TREND IF YOU READ WHAT YOU DID YOU WILL APPRECIATE IT WHERE UMG GH

Muslim Marriage: నయా ట్రెండ్ సెట్ చేసిన ముస్లిం వధువు.. ఏం చేసిందో చదివితే అభినందిస్తారు !

 నయా ట్రెండ్ సెట్ చేసిన ముస్లిం వధువు.. ఏం చేసిందో చదివితే అభినందిస్తారు ! ఎక్కడంటే

నయా ట్రెండ్ సెట్ చేసిన ముస్లిం వధువు.. ఏం చేసిందో చదివితే అభినందిస్తారు ! ఎక్కడంటే

కేరళ(Kerala)లో జరిగిన ఒక ముస్లిం పెళ్లిలో.. వధువు తన పెళ్లి వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన మగవారితో కలిసి నేరుగా పాల్గొంది. మసీదు లోపల పెళ్లి దుస్తుల్లో కనిపించి వేడుకలను ఆకర్షణీయంగా మార్చింది. కేరళలో ఇప్పుడు ఆమె ఓ ట్రెండ్‌(Trend)ను సెట్ చేసింది.

ఇంకా చదవండి ...
ముస్లిం (Muslims)వివాహాలు ఇస్లాం మత ఆచారాల ప్రకారం జరుపుతారు. సంప్రదాయం ప్రకారం వధువులు తమ పెళ్లి(Marriage) వేడుకలకు నేరుగా హాజరుకారు. వధూవరుల తండ్రుల మధ్య జరిగే ఒప్పందం ప్రకారం ఈ ఆచారాన్ని పాటిస్తారు. అయితే తాజాగా కేరళ(Kerala)లో జరిగిన ఒక ముస్లిం పెళ్లిలో.. వధువు తన పెళ్లి వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన మగవారితో కలిసి నేరుగా పాల్గొంది. మసీదు లోపల పెళ్లి దుస్తుల్లో కనిపించి వేడుకలను ఆకర్షణీయంగా మార్చింది. కేరళలో ఇప్పుడు ఆమె ఓ ట్రెండ్‌(Trend)ను సెట్ చేసింది. పెళ్లి కూతురు తండ్రి కేఎస్ ఉమ్మర్ ఈ వివాహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, వివాహ వేడుక నాడు కూతురు పెళ్లిని భిన్నంగా చేయాలని ఆలోచించినట్లు తెలిపారు. కేఎస్ ఉమ్మర్ ఎర్నాకులం జిల్లాలోని పరక్కడవు గ్రామానికి చెందినవారు.

"నా కుమార్తె బహాజా మాతో పాటు మసీదులో తన వివాహాన్ని చూడాలని మా రెండు కుటుంబాలు కోరుకున్నాయి. ఇస్లాం మతంలో ఎక్కడా చోటు లేని ఇలాంటి పద్ధతులను మనం వదిలేయాల్సిన సమయం వచ్చింది. నా కుమార్తెతో సహా వధువులకు వారి వివాహాన్ని చూసే హక్కు ఉంది,” అని ఉమ్మర్ పేర్కొన్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తాము మహల్ కమిటీని సంప్రదించామని.. దానిపై చర్చించిన తర్వాత, వారు తమ విజ్ఞప్తిని అంగీకరించారని చెప్పారు. వారు తమను అభినందించారని కూడా తెలిపారు.

గతవారం పరక్కడవులో జరిగిన మరో పెళ్లిలో వధువు పెళ్లికి నేరుగా అందరితో కలిసి హాజరైంది. కానీ, మసీదులో కాకుండా మసీదు ఆవరణలోనే వివాహ వేడుక జరిగింది. అందుకే, బహాజా వివాహం ఆ ప్రాంతంలో మొదటి వేడుకగా మారింది. ఇక్కడ వధువు మసీదు లోపల వేడుకను వీక్షించ గలిగింది. "కుటుంబం అలాంటి అభ్యర్థన చేసినప్పుడు మహల్ కమిటీ సభ్యుల మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు" అని మహల్ కార్యదర్శి ఇ.జె నియాస్ అన్నారు. భవిష్యత్తులో కూడా, ఏదైనా కుటుంబం కోరుకుంటే అందుకు అనుమతిస్తామని.. మసీదు లోపలకు వధువు వచ్చి తన పెళ్లికి హాజరైతే సంతోషిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Indian Villages: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!


కానీ, ఒక సంవత్సరం క్రితం మలబార్‌లో ఇటువంటి వివాహాలను ప్రారంభించిన సంస్కరణవాద ముస్లిం పండితుడు సి.హెచ్ ముస్తఫా మౌలవి దీని కారణంగా చాలా కష్టపడ్డారట. వధువు, కుటుంబంలోని ఇతర మహిళల సమక్షంలో పెళ్లి వేడుకలు జరిపించినప్పుడు చాలా గందరగోళం నెలకొందని ఆయన చెప్పారు.
మౌలవి మాట్లాడుతూ.. "ఒక మత బోధకుడు ఇలా చేసుకునే వివాహాన్ని వ్యభిచారంగా పేర్కొన్నాడు. దీంతో చాలామంది అతడిపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా అతని వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత కనబరిచారు. అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులు బెదిరించడంతో బోధకుడు తరువాత తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు" అని తెలిపారు. ఆడపిల్లలు ఇలాంటి పద్ధతులకు వ్యతిరేకత చూపిస్తేనే సమాజంలో మార్పులు వస్తున్నాయని ముస్తఫా మౌలవీ చెప్పుకొచ్చారు. కానీ, మెజారిటీ ఆడపిల్లల ఆలోచనా విధానంలో ఎక్కువగా మార్పు లేదని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
Published by:Mahesh
First published:

Tags: Kerala, Marriage, Social Media, Trend

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు