a marriage twist ; కోడలిగా మారిన కూతురు... తప్పిపోయిన ఇరవై ఏళ్లకు గుర్తింపు

a marriage twist ; కోడలిగా మారిన కూతురు... తప్పిపోయిన ఇరవై ఏళ్లకు గుర్తింపు

కోడలిగా మారిన కూతురు

కోడలిగా మారిన కూతురు. తప్పిపోయిన ఇరవై ఏళ్లకు గుర్తింపు పెళ్లి వేడుకల్లో ట్విస్ట్, పెళ్లికి ముందు అందోళన..పెంపుడు కొడుక్కి వధువుగా స్వంత కూతురు.

  • Share this:
మానవ సంబంధాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియకుండానే కొంతమంది జీవితాలు కోనసాగుతాయి.ఊహించని ఘటనలతో కొంతమంది జీవితాలు వెలుగులు నింపుతాయి..ఇలా ఇరవై
సంవత్సరాల క్రితమే తప్పిపోయిన ఓ కూతురు స్వంత ఇంటికి కోడలిగా మారి ప్రత్యక్షమయింది..ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా. కూతురు కోడలిగా ఎలా వస్తుంది అని ఆశ్యర్యపోతున్నారా...ఇక్కడే ఉంది ట్విస్ట్..తాను స్వంత కూతురే అయినా.. చివరికి కోడలిగానే తన ఇంట్లోకి అడుగుపెట్టి తల్లి పెంపుడు కోడుకుకు భార్యగా తల్లికి కూతురుగా చలామణి అవుతోంది.

మానవ సంబంధాలు కొన్ని సార్లు అధ్బుతాలు ఎదురవుతాయి. దీంతో ఊహించని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఈ నేపథ్యంలోనే తాము అంత్యంత అమితంగా ప్రేమించే వారు  కనిపించకుండా పోవడం సహజంగానే జరుగుతుంది. ఇలా ఎక్కువగా పిల్లలు తప్పిపోవడం మళ్లి అనుకోకుండా ప్రత్యక్షమవుతుంటారు. దీంతో ఊహించని మలుపు వారి జీవితాల్లో తిరుగుతోంది. కన్నవాళ్లు తిరిగి రావడంతో వారి అనందానికి అవధులు లేకుండా పోతాయి. అయితే ఇలాంటీ సంఘటనే బీజింగ్ లో జరిగింది. కూతురు గా తప్పి పోయి తల్లి పెంచుకున్న కొడుక్కి కొడలిగా ఇంటికి చేరిన వినూత్న సంఘటన చైనాలోన జియాంగ్సు ప్రావియన్స్‌లో మార్చి 31న ఈ ఘటన చోటుచేసుకుంది.

చైనాలోని జియాంగ్సు ప్రావియన్స్‌లో మార్చి 31న ఓ వివాహం జరిగింది. అయితే ఆ వివాహంలో పలు వింత సంఘటనలు , భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. పెళ్లి నేపథ్యంలో వధువుకు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు వరుడి తల్లి ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో తనకు కాబోయో కొడలి చేతిపై ఉన్న పుట్టుమచ్చ చూసి ఆమే అశ్చర్యపోయింది. దీంతో వధువు తల్లికిఅనేక అనుమానాలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఇలాంటీ పుట్టుమచ్చ ఇరవై సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన కూతుకు కూడ ఉండేదని చెప్పింది.అనేక విచారణల తర్వాత ఆమే తన కూతురే అని నిర్ధారించుకుంది. దీంతో వధువు తల్లి దండ్రులను ప్రశ్నించింది. దీంతో పెళ్లి కూతురు తమకు రోడ్డు వెంట కనిపించడంతో ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటున్నామని వివరించారు.

అయితే అంతా బాగానే ఉన్నా, పెళ్లి కూతురు మాత్రం బోరున విలపించింది. తాను పెళ్లి చేసుకోబోయెది తన రక్తం పంచుకుని పుట్టిన అన్ననేనా .. పెళ్లి చేసుకుంటున్నానని ఆందోళన చెందింది. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది..కూతురు తప్పిపోయిన తర్వాత మరో పిల్లాడిని దత్తత తెచ్చుకుని పెళ్లి కూతురు తల్లి పెంచుకుంటుంది. తాను పెళ్లి చేసుకుంటుంది తన స్వంత అన్నను కాదని పెంపుడు కొడుకు అని తల్లి వివరించింది. దీంతో పెళ్లి జరిగింది. ఇంకేముంది పెళ్లి తంతును ముగించి ఇద్దరిని అశీర్వించారు. మొత్తం మీద పెళ్లి కూతురుకు అటు తల్లిగారు ఇటు అత్తగారి ఇళ్లుకూడ ఒకటే కావడంతో పాటు కన్న తల్లిని గుర్తించడంతో ఆమే అనందానికి అవధులు లేకుండా పోయాయి.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు