Home /News /national /

A MAN WROTE A LETTER TO C M SAYING THAT HIS UNDERWEAR IS TORN PLEASE OPEN THE SHOP VRY

Lockdown కష్టాలు : ఇన్నర్ వేర్‌కు చిల్లులు పడ్డాయి..దుకాణాలు తెరవండి..అంటూ...సీఎంకు లేఖ

ఇన్నర్ వేర్‌కు చిల్లులు పడ్డాయి..దుకాణాలు తెరవండి..అంటూ...సీఎంకు లేఖ

ఇన్నర్ వేర్‌కు చిల్లులు పడ్డాయి..దుకాణాలు తెరవండి..అంటూ...సీఎంకు లేఖ

Lockdown కష్టాలు : లాక్‌డౌన్‌తో సగటు మానవుడు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో ఓ మధ్యతరగతి వ్యక్తి తన లేఖ ద్వార వివరించాడు..తన పరిస్థితిని వివరిస్తూ..తన లో దుస్తులకు చిల్లులు పడ్డాయి కనీసం వారానికి ఒక్కసారైనా దుకాణాలు తెరవండి అంటూ ఏకంగా సీఎం లేఖ రాయడంతో ఆ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

ఇంకా చదవండి ...
కరోనా కష్టాలు సాధరణ మానవులు ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయో..ఈ సంఘటన వింటే తెలుస్తోంది.. తినడానికి తిండిలేక చేయడానికి పనిలేక అనేక మంది ఉసురుమంటూ తమ జీవితాలను వెళ్లదీస్తున్నారు..దీనికి తోడు లాక్‌డౌన్‌ పరిణామాలు లక్షలాది మందికి చుక్కలు చూపిస్తున్నాయి..నెలల తరబడి లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిత్యవసరాలతోపాటు వారికి కావాల్సిన కనీస అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఓ నడివయస్సు వ్యక్తి ఏకంగా తాను పడుతున్న ఇబ్బందులను ఏకంగా సీఎంకు విన్నవించాడు. అదికూడ అందరిని ఆకర్శించే విధంగా ఉండడంతో పాటు ఆయన నిజంగా పడుతున్న ఇబ్బంది అంటూ లేఖను సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశాడు..

అయితే ఈ లేఖ చదివితే కొంచెం అతిగా అనిపించినా..జరుగుతుంది వాస్తవమంటూ ఆయనే ఒప్పుకోవడం కొసమెరుపు..ఇక వివరాల్లోకి వెళితే కరోనా ఉధృతి కారణంగా కర్ణాటల సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది.. ఈనేపథ్యంలోనే కేసులు తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ వస్తున్నారు..దీంతో సగటు వ్యక్తి తన కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది..

ఈ నేపథ్యంలోనే నా లోదుస్తులకు చిల్లులు పడ్డాయ్...దయచేసి దుకాణాలు తెరిపించండి అంటూ మైసూరు నగరంలోని చమరాజపురానికి చెందిన కేఎస్ నరసింహ మూర్తి ఏకంగా సీఎంకు లేఖ రాశారు. అయితే ఆలేఖను సీఎం కు పోస్ట్ చేయకుండా సాధరణ పౌరుల లేఖలను స్వీకరించే న్యూస్ పేపర్‌లోని లెటర్ టు ఎడిటర్ కు పంపారు..అందులో స్పష్టంగా ఇలా రాశాడు....నా వినతి మీకు కాస్త వింతగా అనిపించొచ్చు. కాని ఇది నిజం. నాకు రెండు బనియన్లు, రెండు అండర్‌వేర్‌లు మాత్రమే ఉన్నాయి. వాటికి పూర్తిగా చిల్లులు పడిపోయాయ్. వాటిని కొనుక్కుందామంటే లాక్‌డౌన్ కొనసాగుతుంది..దీంతో కనీసం వారానికి ఒక్కసారైనా షాపులు తెరవాలని కోరారు. దీంతోపాటు ప్రజల నిత్యవసరాలపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించాలని ఆయన విజ్ఝప్తి చేస్తూ స్థానిక పత్రికకు లేఖ రాశారు..దీంతో పాటు ఆలేఖను సోషల్ మీడియాలో కూడ పోస్ట్ చేశాడు.

అయితే ఇలాంటి లేఖలు ప్రజల దృష్టిని ఆకర్షించినా..దీని వెనక చాల పరమార్థమే ఉంటుంది..కరోనాపై ప్రభుత్వాల నిర్ణయాలు సరైన ఆలోచన లేకుండా కొనసాగుతున్నాయి..కనీసం లాక్‌డౌన్ ఉంటుందని ముందస్తు సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం దీంతో ఆసుపత్రులకు , అత్యవసరాలకు వెళుతున్న వారిని కూడ పోలీసులు నిబంధనల పేరుతో అడ్డుకోవడంతోపాటు అనేకమంది రోగులు, చివరకు గర్భిణిలు కూడా అనేక కష్టాలు పడ్డ సంఘటనలు వెలుగు చూశాయి..దీంతో కనీస ఇక కనీస అవసరాల మాట అయితే ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదనే చెప్పాలి.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Lock down, Mysore

తదుపరి వార్తలు