Home /News /national /

A MAN WHO SET UP A RESTAURANT FOR PET DOGS IN CHENNAI WITH LOVE FOR HIS WIFE SNR

Chennai:భార్య కోరిక తీర్చడం కోసం అతను ఎవరూ చేయని పని చేశాడు తెలుసా

Photo Credit:Twitter

Photo Credit:Twitter

Chennai: అతను జంతుప్రేమికుడు కాదు భార్యపై ఉన్న ప్రేమతో కుక్కల కోసం ఓ రెస్టారెంట్‌ ప్రారంభించాడు చెన్నైకి చెందిన విక్రమ్‌ వైష్ణవ్. తన భార్యకు కుక్కలంటే ఇష్టమని చెప్పడంతో ఆమె కోరిక తీర్చడం కోసం ఈ పని చేశాడు.

తమిళనాడులో ఓ వెరైటీ రెస్టారెంట్ పెట్టారు. అక్కడ వెరీ స్పెషల్ ఏమిటంటే..భోజన ప్రియుల కోసం ఆ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయలేదు. మనుషులకు కాకపోతే రెస్టారెంట్‌ ఎందుకని ఆశ్చర్యపోకండి. అక్కడ కేవలం పెంపుడు కుక్కల కోసం ప్రత్యేకించి స్పెషల్ రెస్టారెంట్‌ Restaurant for pet dogs నెలకోల్పాడు ఓ జంతుప్రేమికుడు. వినడానికి కాస్త హాస్యంగా ఉన్నప్పటికి అక్కడికి వెళ్లి చూస్తే ఆశ్చర్యపోతారు.ఈ పెట్‌ రెస్టారెంట్‌ తమిళనాడు (Tamil Nadu)రాష్ట్ర రాజధాని చెన్నై(Chennai)లో సోమవారం (Monday) ప్రారంభించారు. ట్విస్టీ టెయిల్స్ (Twisty Tails)పేరుతో పెంపుడు కుక్కలు, పెట్స్‌ కోసం వాటికి రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారం ఇక్కడ సప్లై చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే పెట్స్‌ రెస్టారెంట్‌ పేరుకు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నప్పటికి అక్కడికి లంచ్, డిన్నర్ కోసం వస్తున్న కుక్కలు మాత్రం ఎంతో ముద్దుగా ఉన్నాయి. సాధారణంగా రెస్టారెంట్‌లో పిల్లలకు సెపరేట్‌ ప్లేస్ ఎలా ఉంటుందో అక్కడ కూడా కుక్కపిల్లలతో ఆడుకోవడానికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశారు హోటల్ యజమాని విక్రమ్‌ వైష్ణవ్(Vikram Vaishnav). ఆ ప్రదేశానికి "స్ట్రెస్ బస్టర్" (Stress buster)అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 7వ(February)తేదిన క్యూట్ పెట్స్‌ కోసం టేస్టీ టెయిల్స్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

అతనికి పెళ్లం అంటే ఇష్టం ఆమెకు..
క్యూట్‌ పెట్స్‌ కోసం ఫిబ్రవరి 7న టేస్టీ టెయిల్స్ అనే రెస్టారెంట్‌ని ప్రారంభించారు. ఇంత ఖర్చు పెట్టి కుక్కల కోసం రెస్టారెంట్‌ ప్రారంభించడం ఏమిటని యజమాని విక్రమ్ వైష్ణవ్‌ని అడిగితే తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని..ఆమెకు కుక్కలంటే ప్రాణమని అందుకే ఇద్దరు కోరికలు తీర్చుకునేందుకే రెండు ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని టేస్టీ టెయిల్స్ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేయడం జరిగిందంటున్నాడు యజమాని విక్రమ్‌ వైష్ణవ్.

కుక్కల కోసం రెస్టారెంటా..
మన దేశంలో ఇలాంటి రెస్టారెంట్‌లు అరుదుగా ఉంటాయి. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఓ వ్యక్తి కుక్కల కోసం రెస్టారెంట్‌ ప్రారంభించాలన్న యజమాని ఆలోచనను జంతు ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. మనుషులు అయితే రుచికరమైన, నాణ్యమైన ఆహారం తీసుకుంటారు. మరీ పెంపుడు కుక్కలకు రోజు పౌష్టికరమైన ఆహారం అందించే సమయం లేని వాళ్లు, తయారు చేయడం కుదరని వాళ్లకు ఈ పెట్ రెస్టారెంట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Chennai, Pet dog

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు