చితిపైన ప్రాణం పోసుకున్న వ్యక్తి ..అంత్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచిన వృద్దుడు
ప్రతీకాత్మకచిత్రం
a man opened his eyes while last rites | అంత్యక్రియలకు అంతా సిద్ధం చేశారు. ఇంతలోనే చనిపోయాడనుకున్న వ్యక్తి కళ్లు తెరిచాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు చివరకు స్మశానంలో పని చేస్తున్న వాళ్లంతా ఆ దృశ్యాన్ని కళ్లారా చూసి షాక్ అయ్యారు.
వైద్యశాస్త్రానికే అంతు చిక్కని అద్భుతం ఇది. సినిమాల్లో డాక్టర్లు చెప్పే రొటీన్ డైలాగై అయినప్పటికి ఢిల్లీలో అదే నిజంగా జరిగింది. 60ఏళ్లకు పైబడిన క్యాన్సర్ పేషెంట్‌ని ట్రీట్మెంట్ చేయించేందుకు బంధువులు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎంత మంది డాక్టర్లకు చూపించినా..ఫలితం లేదని తేల్చారు. ఆశలు వదులుకున్న రోగి బంధువులు తర్వాత జరగాల్సిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. చనిపోయిన వ్యక్తి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడే అద్భుతం జరిగింది. చనిపోయిన వ్యక్తి ప్రాణం పోసుకున్నాడు. అక్కడున్న బంధువులను ఆత్మీయంగా పలకరించాడు. నిజమా అని ఆశ్చర్యపోకండి. ఇది వాస్తవం. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.
స్మశానంలో పునర్జన్మ..
చనిపోయిన వ్యక్తిని దగ్గర్లోని స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించాడనికి చేయాల్సిన తతంగం అంతా చేస్తున్నారు కుటుంబ సభ్యుులు. చితికి నిప్పంటించే ముందు పడుకోబెట్టిన వ్యక్తి నోట్లో గంగానది జలాన్ని పోశారు కుటుంబ సభ్యుల్లో ఒకరు. అది జరిగిన కొద్ది క్షణాల్లోనే మృతదేహంగా చితిపై పడుకోబెట్టిన వ్యక్తి కళ్లు తెరవడం, అక్కడున్న తన కుటుంబ సభ్యుల వైపు చూసి సైగలు చేయడంతో వెంటనే వాళ్లు అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.
మృత్యుంజయుడు..
స్మశానంలో ప్రాణం పోసుకున్న వ్యక్తి పేరు. సతీష్ భరద్వాజ్. టిక్రీ ఖుర్ద్ ప్రాంతానికి చెందిన 62ఏళ్ల వృద్ధుడు గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కొన్ని రోజులుగా అతడి కండీషన్ క్రిటికల్‌గా మారడంతో కుటుంబ సభ్యులు చాలా మంది వైద్యులకు చూపించారు. చివరగా నరేలాలోని రాజాహరిశ్చంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు హెల్త్ కండీషన్ పర్వాలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెరుగైన వైద్యం చేయించేందుకు లోక్‌నాయక్ జయప్రకాష్‌నారాయణ్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత సతీష్ భరద్వాజ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరికొందరు డాక్టర్లకు చూపించారు. 10మంది వైద్యులు అతను చనిపోయాడని తేల్చి చెప్పారు. దీంతో వేరే గత్యంతరం లేక కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించేందుకు రోగిని స్మశానానికి తీసుకెళ్లిన తర్వాత ఇదంతా జరిగింది.
తులసి తీర్ధంగా పనిచేసిన గంగాజలం..
చనిపోయే ముందు ఎవరికైనా నోట్లో తులసి తీర్ధం పోయడం భారతీయ సాంప్రదాయం. తులసిరసం సర్వరోగ నివారణిగా భారతీయ ఆయుర్వేద వైద్యం చెబుతోంది. కానీ ఢిల్లీలో మాత్రం చనిపోయాడనుకున్న వ్యక్తి విషయంలో గంగాజలం తులసితీర్ధంగా పనిచేసింది. సతీష్ భరద్వాజ్ అనే వృద్ధుడికి స్మశానంలో పునర్జన్మ కలగడం ఆశ్చర్యకరమైన విషయమే అయినప్పటికి ఇలాంటి ఘటనలు గతంలో మనదదేశంలోనే పలుచోట్ల వెలుగుచూసిన సందర్భాలు ఉన్నాయి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.