రాజస్థాన్‌లో ట్రాక్టర్ డ్రైవర్‌కి... రూ.23 వేల ఫైన్... ఒడిషాలో ఆట్రో డ్రైవర్‌కి రూ.47,500 ఫైన్... ఈ రెండు ఘటనలూ... దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అయ్య బాబోయ్ ఏంటి ఈ ఫైన్లు... కట్టాలా... బండ్లను ఇంట్లో పెట్టుకోవాలా... అని జనం ఆశ్చర్యపోతుంటే... ఇలాంటిదే మరో సంఘటన ఏకంగా ఢిల్లీలోనే జరిగింది. ఏంటంటే... ఢిల్లీలోని... షేక్ సరాయ్ ఏరియాలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఎందుకంటే... నడి రోడ్డుపై ఓ బైకర్... తన బైక్‌పై పెట్రోల్ పోశాడు. ట్రాఫిక్ పోలీసులు చూస్తుండగానే... సిగరెట్ లైటర్‌ని బండిపై విసిరికొట్టాడు. అంతే... బండి ఒక్కసారిగా తగలబడింది. క్షణాల్లో బండి మొత్తం మంటలు అంటుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ఇతర వాహనదారులు, నడుస్తూ వెళ్లే ప్రజలు అందరూ ఆశ్చర్యపోతూ చూశారు. ఏం జరుగుతోందక్కడ అన్న ప్రశ్నే అందరి మైండ్లలో.
అలర్టైన పోలీసులు... వెంటనే వాటర్ వేసి... మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందంటే... పోలీసులు ఆ బైక్ డ్రైవర్... ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాడని రోడ్డుపై బైక్ ఆపారు. రకరకాల పెనాల్టీలకు సంబంధించి రూ.3.900 చలాన్ ఇచ్చారు. దాన్ని చూడగానే షాకైన అతను... ఇంత చలాన్ కట్టడం కంటే బైక్ బదులు బస్సులో పోవడం బెటరన్నాడు. పోలీసులు అది మీ ఇష్టం... సెప్టెంబర్ 1 నుంచీ కొత్త రూల్స్ వచ్చాయి కదా... అన్నారు. చలాన్ కట్టకపోతే ఏం చేస్తారని ప్రశ్నిస్తే... చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. "అవునా... సరే తీసుకోండి... అసలు నాకు బైకే లేదు... ఇకపై నేను బైక్ నడపను... ఏం చేస్తారో చేసుకోండి" అంటూ అతను తన ఆగ్రహాన్ని బైక్‌పై చూపించాడు. పోలీసులు మాత్రం అతను మద్యం తాగిన మత్తులో అలా చేశాడని చెబుతున్నారు.
ఇదీ పరిస్థితి. ప్రజల్లో మార్పు రావాలంటే కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ఉండాల్సిందేనని కేంద్రం చెబుతోంది. నిజమే... ప్రజల్లో చాలా మార్పు వస్తోంది... ఎంతలా అంటే... వాహనాల్ని తగలబెట్టుకునేంతలా అంటున్నాయి విపక్షాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, TRAFFIC AWARENESS, Traffic police, Traffic rules