Bihar : 18 ఏళ్ల వయస్సులో తప్పిపోయాడు.. 12 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ జైళ్లో తేలాడు ఓ వ్యక్తి.. అయితే అప్పటికే ఆయన చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేయడంతో పాటు భార్య కూడా మరో పెళ్లి చేసుకుంది.
ఎవరైనా తప్పిపోయి కొద్ది సంవత్సరాల తర్వాత తిరిగి రావడం సర్వసాధరణం... అయితే తప్పిపోయిన వారు... మతిస్థిమితం లేక దేశంలోనే ఏదో ఒక చోట అనాధ ఆశ్రమంలోనో లేదా ఇతర చోట్ల ఉంటి సృహలోకి వచ్చిన తర్వాత తిరిగి తమ వారిని గుర్తు చేసుకుని వారి వద్దకు చేరతారు... కాని ఇక్కడ కూడా బిహార్క చెందిన మసాహర్ అనే ఓ వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో మనస్సు బాగా లేక ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. అయితే చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో పాటు ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఆ తర్వాత ఇంట్లో నుండి వెళ్లిపోయాడు.. దీంతో చాలా రోజుల పాటు వెతికారు. చివరకు ఎక్కడ చనిపోయాడు అనుకుని ఖర్మకాండలు కూడా చేశారు. ఆ తర్వాత అతని భార్య కూడా వేరొకరిని పెళ్లి చేసుకుంది.
కాని పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి బతికి ఉన్నాడని తెలిసింది. అదికూడా పాకిస్తాన్ జైళ్లో ఉన్నట్టు స్థానిక పోలీసులు ఆ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. మసాహర్ కు చెందిన ధృవీకరణ పత్రాలు విదేశాంగా శాఖ నుండి ఆయన ఇంటికి చేరాయి. దీంతో ఆయన ఫోటో చూసి కుటుంబ సభ్యులు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి విదాశంగా ద్వార అసలు విషయం తెసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వయస్సులో పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాడు. అక్కడి పోలీసులకు ఎందుకు పట్టుపట్టాడనే అంశాలపై దృష్టి సారించారు. అయితే ఆ కుటుంబ సభ్యులకు ఓ వైపు సంతోషంతో పాటు మరోవైపు అయోమయంలో కూడా ఉన్నారు.. కొడుకు తిరిగి వచ్చినందుకు సంతోష పడుతూనే.. భార్య మరో పెళ్లి చేసుకోవడంతో ఎం చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు.
మరోవైపు వరంగల్ జిల్లా ఐనవోలు మండలంలోని సురేష్ అనే వ్యక్తి అంత్యక్రియలు చేసేందుకు ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన శవాన్ని అంతిమ సంస్కారాలకు వారి వ్యవసాయ భూమిలో నుండి తీసుకువెళ్లేందుకు చుట్టుపక్కల వారితో పాటు స్థానికులు కూడా అంగీకరించడం లేదు. సురేశ్ కుటుంబసభ్యులు బ్రతిమిలాడినా వారు పట్టించుకోవడంలేదు .. దీంతో చేసేదేమి లేక సురేశ్ ఇంట్లోనే పాతిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.