Diamond: గని కార్మికుడికి దొరికిన వజ్రం... దాని విలువ ఎంతో తెలుసా..?

రేయనక, పగలనక కష్టపడుతున్న ఆ కార్మికుడిని విధి కరుణించింది. పొద్దస్తమానం పనిచేస్తున్నా కుటుంబాన్ని కూడా పోషించలేని స్థితిలో ఉన్న అతడిని భూతల్లి ఆదుకుంది.

news18
Updated: October 30, 2020, 10:21 AM IST
Diamond: గని కార్మికుడికి దొరికిన వజ్రం... దాని విలువ ఎంతో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 30, 2020, 10:21 AM IST
  • Share this:
రేయింబవళ్లు కష్టపడుతున్న ఆ కార్మికుడిని విధిరాతను భూమాత మార్చింది. పొద్దస్తమానం ఆ కార్మికుడు పడుతున్న కష్టాన్ని చూసి.. అతడిని కరుణించింది. ఎండనక, వాననక కష్టపడుతున్నా.. ఇంట్లో కష్టాలు గట్టెక్కడం లేదనుకుందో ఏమో గానీ.. అతడి బంగారు భవిష్యత్తును అందజేసింది. తనను తవ్వుతున్నా.. ఓర్చుకుంటూ, ఆ నొప్పిన పంటి కిందే భరిస్తూ.. తన గర్భంలో దాచుకున్న వజ్రాన్ని ఆ కార్మికుడికి అందించింది. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో జరిగిన ఈ ఘటనతో సదరు కార్మికుడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

మధ్యప్రదేశ్ లోని  పన్నా జిల్లా (బుందేల్ ఖండ్ రీజియన్) కు చెందిన బల్బీర్ సింగ్ యాదవ్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. రెక్కాడితే గానీ డొక్కాడని బల్బీర్ సింగ్.. పన్నా జిల్లాలోని కళ్యాణ్పూర్ గనుల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు గనుల్లో పనిచేస్తుండగా.. గురువారం ఆయనకు మెరుస్తూ ఒక వస్తువు కనిపించింది. దానిని బయటకుతీయగా.. వజ్రం.. 7.2 క్యారెట్ల వజ్రం. దానిని చూడగానే ఉబ్బితబ్బిబ్బయిన బల్బీర్ సింగ్.. వజ్రాన్ని అధికారులకు ఎందుకివ్వడం.. నేనే దాచుకుంటానని అనుకోలేదు. నిజాయితీగా దానిని తీసుకొచ్చి డైమెండ్ ఇన్స్పెక్టర్ కు అందజేశాడు.

ఇది చూసిన సదరు అధికారి బల్బీర్ సింగ్ నిజాయితీని మెచ్చుకున్నారు. దొరికిన వజ్రం విలువ ఎంత ఉంటుందనే విషయాన్ని నిపుణులు అంచనావేస్తారని ఆయన తెలిపారు. కాగా, ఈ వజ్రాన్ని వేలం వేస్తారని.. వచ్చిన సొమ్ములోంచి 12.5 శాతం రాయితీని మినహాయించి..మిగిలిన సొమ్మును బల్బీర్ సింగ్ కు అప్పగిస్తామని ఆయన వివరించారు.   అయితే ఆ వజ్రం విలువ రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల దాకా ఉండొచ్చునని పలువురు చెబుతున్నారు. ఈ వార్త తెలియగానే బల్బీర్ సింగ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెనుకబడిన ప్రాంతంగా పేరున్న బుందేల్ కండ్ వజ్రాలు, బంగారం నిధులకు పెట్టని కోట. ఇక్కడ వందల టన్నుల విలువ చేసే బంగారు నిక్షేపాలున్నట్టు ప్రభుత్వం గుర్తించిన విషయం విదితమే.
Published by: Srinivas Munigala
First published: October 30, 2020, 10:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading