హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: భార్య చివరి కోరిక తీర్చడం కోసం ..యావదాస్తిని వదులుకున్నాడంట

OMG: భార్య చివరి కోరిక తీర్చడం కోసం ..యావదాస్తిని వదులుకున్నాడంట

Himachal Pradesh: కోట్ల రూపాయల ఆస్తి ఉంది. సంతానం లేదు. కట్టుకున్న భార్య గతేడాది కన్నుమూసింది. చనిపోతూ తన భార్య అడిగిన చివరి కోరిక తీర్చడం కోసం ఉద్యోగం చేసి సంపాధించిన ఆస్తినంతా దానం చేశాడు. డెబ్బై ఏళ్ల వయసు దాటిన వ్యక్తి చేసిన ఆ పని ఏంటో తెలుసా.

ఇంకా చదవండి ...

  జీవితాంతం కష్టపడి కూడబెట్టిన సంపాదన ఎవరికైనా దానం చేయాలనిపిస్తుందా చెప్పండి. కానీ ఆయనకు మాత్రం అలాగే చేయాలనిపించింది. దానికి కారణాలు ఏమి లేవు. కేవలం తన భార్య చివరి కోరిక తీర్చడం కోసం తన యావదాస్తిని దానం చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)కి చెందిన రిటైర్డ్ ఉద్యోగి (Retired employee)రాజేంద్ర కన్వార్(Rajendra kanwar)స్టోరీ ఇది. హమీర్‌పూర్‌ (Hamirpur) జిల్లా నదౌన్‌ (Nadaun)సబ్‌ డివిజన్‌లో భారీ బంగ్లాలో నివాసముంటున్నారు రాజేంద్ర కన్వార్‌. ఆరోగ్యశాఖ(Health department)లో ఉన్నతమైన ఉద్యోగం చేసి కొద్దిరోజుల క్రితమే పదవీ విరమణ (Retired)చేశారు. ఆయన భార్య కృష్ణ కన్వర్‌ (Krishna kanwar) విద్యాశాఖ (Education department)లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేశారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఎలాంటి చీకు, చింత లేకుండా కాలం గడిపారు. కాకపోతే వీళ్లకు సంతానం లేకపోవడంతో దురదృష్టమనే చెప్పాలి. ఇద్దరు పదవీ విరమణ చేశారు. గతేడాది అనారోగ్యం వల్ల రాజేంద్ర కన్వర్‌ సతీమణి కృష్ణ కన్వర్‌ మృతి చెందింది. అయితే ఆమె చనిపోయే ముందు భర్తను ఓ కోరిక కోరింది.  అదేంటంటి..భార్యభర్తలకు చెందిన యావధాస్థిని ప్రభుత్వానికి దానం చేయాలని విజ్ఞప్తి చేసింది. భార్య చనిపోతూ కోరిన చివరి కోర్కెను తీర్చాలన్న మంచి ఆలోచన.. రాజేంద్ర కన్వర్‌ తమకు చెందిన సుమారు ఐదు కోట్ల 5 croreరూపాయల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి దానం చేస్తున్నట్లు ప్రకటించారు.

  భార్య చివరి కోరిక తీర్చడం కోసం..

  జోల్సప్పాడు, శంకర్‌ గ్రామాల్లో సుమారు 33సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన రాజేంద్ర కన్వర్‌ పదవీ విరమణ తర్వాత అక్కడ సంపాధించుకున్న స్థిర, చరాస్తులన్నింటికి ప్రభుత్వానికి అప్పగించారు. తమకు వారసులెవ్వరూ లేకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని రాజేంద్ర కన్వర్‌ తెలిపారు. ఆస్తులు, అంతస్తులు సంపాధించుకున్నప్పటికి భార్య తోడుగా లేదనే విషయం ఎంతో బాధను కలిగిస్తోందంటున్నారు రాజేంద్ర కన్వర్.

  యావదాస్థిని దానం..

  భార్య చివరి కోరిక తీర్చడం కోసం ఓ భర్త జీవితాంతం సంపాధించుకున్న ఆస్తుల్ని ఇలా దానం చేస్తున్నారని తెలిసిన స్థానికులు ఆయన గొప్ప మనసును స్వాగతించారు. రాజేంద్ర కన్వర్‌ ఉండే ఇంటి దగ్గరకు వచ్చి పలకరించడం, క్షేమ సమాచారం కనుక్కొని వెళ్లడం చేస్తున్నారు. ఆస్తుల కోసం రక్తసంబంధీకుల్ని చంపేసే వ్యక్తులు ఉన్న ఈరోజుల్లో ఇలా తమ యావదాస్తిని ప్రభుత్వానికి అప్పగించడం ఎంతైనా గర్వించదగిన విషయమని రాజేంద్ర కన్వర్‌, ఆయన సతీమణి కృష్ణ కన్వర్‌ని ప్రసంశిస్తున్నారు. వారసులు లేకలేకపోయినా బంధువులకు, అయిన వాళ్లకు కట్టబెట్టేందుకు అవసరానికి మించి ఆస్తులు కూడబెడుతున్న వాళ్లంతా ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

  First published:

  Tags: Donation, Himachal Pradesh

  ఉత్తమ కథలు