Home /News /national /

Variety case : వింత కేసు...! బర్రె పాలు ఇవ్వడం లేదంటూ స్టేషన్‌కు... బుద్ది చెప్పండంటూ ఫిర్యాదు..!

Variety case : వింత కేసు...! బర్రె పాలు ఇవ్వడం లేదంటూ స్టేషన్‌కు... బుద్ది చెప్పండంటూ ఫిర్యాదు..!

buffalo

buffalo

Variety case : కర్టాటకలో పోలీసులకు ఓ వింత కేసు ఎదురైంది. తన బర్రెలు పాలు ఇవ్వడం లేదంటూ పోలీసు స్టేషన్‌కు చేరాడు.. వాటికి బుద్ది చెప్పండి అంటూ ఫిర్యాదు చేశారు. లేదంటే కేసు నమోదు చేయాలని కోరాడు..

    ఈ మధ్య పోలీసులకు వింత కేసులను ఎదుర్కొంటున్నారు.. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్లవరకు చాలా మంది అనేక వింత కేసులతో పోలీసుల దరికి చేరుతున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. అయితే పోలీసుల చేతుల్లో పరిష్కారం లభిస్తే.. ఓకే కాని వాళ్ల చేతుల్లో లేని సమ్యలను వారికి సంబంధం లేని కేసులు కూడా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నాయి.

    ఈ క్రమంలోనే ఇటివల ఓ పిల్లావాడు సైతం తన ఫ్రెండ్ క్లాస్ రూంలో పెన్సిల్ తీసుకుని ఇవ్వడం లేదని ,వాడిపై కేసు నమోదు చేయాలని పిల్లలందరు పోలీసు స్టేషన్‌కు రావడం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే..దీంతో అమ్మ కొట్టిందని, తండ్రి మందలించాడనే కేసులు కూడా పోలీసుల దరికి చేరుతున్నాయి. ( A farmer came to police station to file case on buffalo ) అయితే ఇవి మానవ సంబంధాలతో కూడుకున్న కేసులే అయినా.. ఇటివల పశువుకు సంబంధించిన కేసులు కూడా పోలీసు స్టేషన్‌కు చేరుతున్నాయి. తమ బర్రె పాలు ఇవ్వలేదని కొందరు, మరి కొందరు బర్రెకు చేతబడి చేశాడని మరికొందరు కేసులు నమోదు చేస్తున్నారు...

    cannabis : గంజాయికి అలవాటు పడిన యువకుడు.. నగర నడిబోడ్డున మొక్కల పెంపకం..


    ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలో ఓ వింత కేసును పోలీసులు ఎదుర్కొన్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన బర్రెలు పాలు ఇవ్వడం లేదని, వాటికి తగినంత గడ్డి, దాణా పెడుతున్నా.. నాలుగు రోజుల నుండి పాలు ఇవ్వడం లేదు. ( A farmer came to police station to file case on buffalo ) పితకాడానికి వెళితే.. కాళ్లతో తంతున్నాయని ,దీంతో గేదేలకు బుద్ది చెప్పండి , పాలు ఇచ్చేలా చేయండి అంటూ పోలీసులకు చెప్పాడు. లేదంటే వాటిపై కేసు నమోదు చేయాలని కోరాడు. అయితే పోలీసులు మాత్రం ఆ రైతుకు నచ్చజెప్పి పంపారు. ఇలాంటీ వాటిపై కేసులు నమోదు చేయడం కుదదని చెప్పారు. దీంతో ఈ కేసు కర్ణాటకలోని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    కాగా ఇలాంటీ సంఘటనే ఒకటి ఇటివల మధ్యప్రదేశ్ బింధ్‌ జిల్లా నాయ్‌గావ్‌ పోలీస్‌స్టేషన్‌‌కు చేరింది. తన గేదె పాలివ్వడం లేదంటూ బాబూ లాల్‌ జాతవ్‌ (45) అనే రైతు పోలీసులను ఆశ్రయించాడు. నేరుగా గేదెను స్టేషన్‌కు తీసుకువచ్చి ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజులుగా తన గేదె పాలివ్వడం లేదని తెలిపాడు. అయితే తన గేదెకు ఎవరో చేతబడి చేశారని చెప్పాడు.


    Bus accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఇద్దరు పిల్లలతో పాటు డ్రైవర్ మృతి.


    అయితే పోలీసులు పట్టించుకోకుండా మాములుగా వ్యవహరించారు. దీంతో ఆ రైతు కాసేపు ఆగి మరోసారి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.. తన గేదె విషయం ఏదో ఒక పరిష్కారం చూపాలని ప్రాధేయపడ్డాడు. దీంతో పోలీసులు ఆ రైతుకు ఓ సలహా ఇచ్చారు. గేదె పాలు ఇవ్వకపోవడానికి కారణం తెలుసుకునేందుకు పశువుల ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అయినా వినకపోవడంతో.. నచ్చజెప్పి పంపించారు. దీంతో గేదెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లిన మరునాడే అది పాలు ఇవ్వడం ప్రారంభించింది. తర్వాత మళ్లి పోలీసుల స్టేషన్‌కు చేరుకుని ఇదే విషయాన్ని పోలీసులకు చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు స్థానిక డీఎస్పీ తెలిపారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Buffalo, Karnataka, Police Case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు