Home /News /national /

A FAMOUS FOOT WEAR COMPANY FINED RS 9000 FOR ASKING CUSTOMER TO PAY RS 3 FOR CARRY BAG MS

ప్రముఖ చెప్పుల కంపెనీకి షాక్ : రూ.3 క్యారీ బ్యాగ్ కోసం రూ.9వేల జరిమానా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

A famous foot wear company fined : దినేశ్ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన వినియోగదారుల ఫోరమ్ అతని వాదనతో ఏకీభవించింది. కస్టమర్లకు ఫ్రీ బ్యాగ్ ఇవ్వాల్సిందేనని బాటాకు ఆదేశాలు జారీ చేసింది.

    షాపింగ్ మాల్స్‌లో ఏవైనా వస్తువులు, లేదా బట్టలు కొనుగోలు చేసినప్పుడు.. క్యారీ బ్యాగ్‌కి అదనంగా చార్జీ వసూలు చేయడం అందరికీ తెలిసిందే. ఆ క్యారీ బ్యాగ్‌పై సదరు షాప్‌కి సంబంధించిన పేరు, చిరునామా ఉంటుంది. తద్వారా అది సదరు సంస్థ ప్రమోషన్‌కు కూడా పనికి వస్తుంది. సాధారణంగా అందరూ దీన్ని కామన్ అనే అనుకుంటారు. కానీ ఓ కస్టమర్ మాత్రం దీనిపై వినియోగదారుల ఫోరమ్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు సంస్థకు రూ.9వేల జరిమానా తప్పలేదు. చంఢీఘర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

    చంఢీఘర్‌ నివాసి అయిన దినేశ్ ప్రసాద్ రాతూరి ఇటీవల స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ చెప్పుల షోరూమ్‌కు వెళ్లి ఒక జత చెప్పులు కొనుగోలు చేశాడు. ఇందుకు గాను బాటా సిబ్బంది రూ.402 చార్జి చేశారు. అందులోనే పేపర్ బ్యాగ్‌కి కూడా కలిపి చార్జి వసూలు చేశారు. అయితే దినేశ్‌ దీనిపై అభ్యంతరం తెలుపుతూ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. తనకు ఇచ్చిన బ్యాగ్‌పై బాటా బ్రాండ్ ప్రమోషన్ ఉందని.. సదరు సంస్థ ప్రమోషన్ కోసం ఇచ్చే బ్యాగ్‌కు కూడా కస్టమర్ వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడమేంటని వినియోగదారుల ఫోరమ్‌కు దినేశ్ ఫిర్యాదు చేశాడు.

    దినేశ్ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన వినియోగదారుల ఫోరమ్ అతని వాదనతో ఏకీభవించింది.కస్టమర్లకు ఫ్రీ బ్యాగ్ ఇవ్వాల్సిందేనని సదరు చెప్పుల షాప్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.అంతేకాదు, క్యారీ బ్యాగ్ కోసం కస్టమర్ల వద్ద నుంచి రూ.3 వసూలు చేసి మరీ తమ బ్రాండ్‌ను వాటిపై ప్రమోట్ చేసుకుంటున్నందుకు మొత్తం రూ.9వేలు జరిమానా విధించింది. ఇందులో రూ.1000ని లిటిగేషన్ చార్జిల కింద, కస్టమర్లను ఇబ్బందిపెట్టినందుకు గాను జరిమానా కింద రూ.3000, అలాగే రూ.5000 వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్ ఖాతాలో జమ చేయాల్సిందిగా ఆదేశించింది. మొత్తం మీద క్యారీ బ్యాగ్‌ల కోసం కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న షాప్స్‌కు ఇది కనువిప్పు కలిగిస్తుందేమో చూడాలి.
    First published:

    Tags: Haryana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు