Home /News /national /

A COW ATE GOLD ARNAMENT WHILE EATING WITH FRUITS IN KARNATAKA VRY

Gold chain : ఆవు కడుపులో గోల్డ్ చైన్.. నెల రోజుల వెయిటింగ్...చివరికి ఇలా చేశారు..

gold chain

gold chain

Gold chain : పూజల కోసం ఆవు మెడలో నెక్లెస్ వేస్తే... ఆ ఆవు ఏకంగా బంగారు గొలుసునే మింగేసింది. దీంతో నెల రోజుల పాటు గొలుసు వేచి చూసిన ఆ కుటుంబ సభ్యులు చివరకు ఆవుకు ఆపరేషన్ చేసి గొలుసును బయటకు తీశారు.

    ఒక్కోసారి కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి.. వాటితో ఆయా వ్యక్తులు నానా హైరానా పడతారు.. కాని ఆ సంఘటన సుఖాంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఇలాంటీ సంఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది.

    కర్ణాటకలోని ( Karnataka ) ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి తాలుకా, హీపనహల్లిలో శ్రీకాంత్ హెగ్డే, తన ఫ్యామిలీకి 4 ఏళ్ల ఆవు ఉంది. అయితే అక్కడ దీపావళీ పర్వదినంతో పాటు పలు పండగలకు ఆవులక ప్రత్యేక పూజలు చేస్థారు. దీంతో వాటికి పూలు పండ్లతో పాటు మెడలో బంగారు ఆభరణాలు కూడా వేస్తారు. ఇలా సంప్రదాయం కొనసాగుతూ వస్తున్న తరుణంలోనే తమ ఇంట్లోని ఆవుకు పూజలు అవుతున్న సేపు ఆవు మెడలో ఓ బంగారు గొలుసును వేశారు. ఇక పూజ అయిపోయిన తర్వాత ఆ ఆవు మెడలోని బంగారు గొలుసు తీసి కింద పెట్టారు. దీంతో అప్పటికే ఆకలితో ఉన్న కింద ఉన్న పండ్లతో పాటు ఆవు వెంటనే బంగారు గోలుసును ఒక్కసారిగా మింగింది.

    Odisha : సెలవుల కోసం.. నీళ్లలో విషం కలిపిన విద్యార్థి... చివరికి ఇలా అయింది...!


    అయితే గోలుసు కింద పెట్టిన కుటుంబ సభ్యులు ( Family members ) ఇది గమనించకుండా ఇంట్లో అంతా వెతికారు. బయట ఆవు వద్ద కూడా కనిపించకపోవడంతో మింగివేసిందనే అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎదైనా వస్తువులను ఆవు మింగినప్పుడు పేడలో వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పేడ కోసం ఎదురు చూశారు. ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా నెలరోజుల పాటు ఆవు పెడ వద్ద దాదాపు కాపాలా కాసిన పరిస్థితి నెలకొంది.

    Revanthreddy : అమర వీరుల స్థూపం నిర్మాణంలో అక్రమాలు... అమరుల స్థూపం నిర్మాణం ఆంధ్రా కాంట్రాక్టర్లకు... ? ఆందుకే ఆలస్యం


    అయితే నెల రోజులైన బంగారు గొలుసు ( Gold chain ) బయటకు రాకపోవడంతో... నిరాశ చెందిన కుటుంబ సభ్యులు ఎట్టకేలకు ఆ ఆవును ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆవును పరీశీలించిన వైద్యులు బంగారు గొలుసు దాని పొట్టలో ఇరుక్కుపోయినట్టు స్కానింగ్ ద్వారా బయటపడింది. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు దాన్ని బయటకు తీశారు. అయితే ఆవు మింగిన గొలుసు 20 గ్రాములు ఉండేదని దాన్ని బయట తీసిన తర్వాత రెండు గ్రాములు తగ్గిందని కుటుంబ సభ్యులు వాపోయారు. మొత్తం మీద రెండు గ్రాముల బంగారం పోయినా మిగతా గొలుసు దక్కిందని కుటుంబ సభ్యులు చెప్పారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Cow, Karnataka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు