• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • A CHOPPER CARRYING LULU GROUP CHAIRMAN MA YUSUFF ALI AND HIS WIFE MADE A FORCEFUL LANDING IN KOCHI SSR

Chopper: ఓ ప్రముఖ బిజినెస్‌మాన్ భార్యతో కలిసి హెలికాఫ్టర్‌లో వెళుతుండగా.. చివరికిలా జరిగింది..!

Chopper: ఓ ప్రముఖ బిజినెస్‌మాన్ భార్యతో కలిసి హెలికాఫ్టర్‌లో వెళుతుండగా.. చివరికిలా జరిగింది..!

కొచ్చిలో హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్

దుబాయ్‌కి చెందిన ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ లులూ గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేరళలోని కొచ్చిలో చాపర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో హెలికాఫ్టర్‌లో యూసఫ్ అలీతో పాటు...

  • Share this:
    కొచ్చి: దుబాయ్‌కి చెందిన ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ లులూ గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేరళలోని కొచ్చిలో చాపర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో హెలికాఫ్టర్‌లో యూసఫ్ అలీతో పాటు ఆయన భార్య, మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. కొచ్చిలోని కేరళ యూనివర్సిటీ ఫిషరీస్ క్యాంపస్‌కు దగ్గర్లో ఉన్న ఖాళీ ప్రదేశంలో హెలికాఫ్టర్ ల్యాండ్ అయింది. ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. యూసఫ్ అలీ, ఆయన భార్యతో పాటు మిగిలిన వారంతా క్షేమంగా బయటపడ్డారు. అబ్జర్వేషన్ నిమిత్తం హెలికాఫ్టర్‌లో ప్రయాణించిన వారిని కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన దృశ్యాలను పరిశీలించగా.. అందులోకి నీళ్లు వెళ్లినట్లు తెలిసింది. హెలికాఫ్టర్ దిగిన ప్రదేశం చిత్తడిగా ఉండటం గమనార్హం. వాతావరణం అనుకూలించక పోవడం, మేఘాలు అలుముకోవడంతో చీకట్లు కమ్ముకోవడంతో హెలికాఫ్టర్‌ను పైలట్ అత్యవసరంగా కిందకు దించినట్లు తెలిసింది. హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు వస్తున్న వార్తలను లులూ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వి.నందకుమార్ కొట్టిపారేశారు. కారణం సాంకేతిక లోపం కాదని స్పష్టం చేశారు. యూసఫ్ అలీ, ఆయన భార్య రంజాన్ నేపథ్యంలో వ్యక్తిగత ట్రిప్‌కు వెళ్లారని ఆయన చెప్పారు.

    ప్రస్తుతం కొచ్చిలోని లేక్‌షోర్ హాస్పిటల్‌లో ఈ దంపతులు అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు నందకుమార్ తెలిపారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ కేరళలోనే జన్మించారు. ఇటీవలే యూఏఈ దేశ యువరాజు యూసఫ్ అలీని సత్కరించారు. యూఏఈని శక్తివంతం చేస్తున్న 12 మంది వ్యక్తుల్లో యూసఫ్ అలీ ఒకరని కీర్తించారు.

    Lulu Group chairman, MA Yusuff Ali, Kochi, Chopper, Dubai

    అబుదాబి కేంద్రంగా వివిధ దేశాల్లో లులూ గ్రూప్ రిటైల్ కంపెనీలు నిర్వహిస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో లులూ గ్రూప్‌తో రూ.2,2000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో స్టార్ హోటల్, అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు లులూతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సమయంలో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో శంకుస్థాపన కూడా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లులూతో ఒప్పందం రద్దు చేసుకుంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు