డాక్టర్లు, చనిపోయాడని ధృవికరించినా...ఓ బాలుడు లేచి కూర్చున్నాడు..డాక్టర్ల ధృవీకరించడంతో...బాలుడు చనిపోయాడనుకొని తల్లితండ్రులు అంత్యక్రియలు చేసేందుకు సన్నద్దమయ్యారు. అయితే తమ కొడుకును చివరి చూపులు చూసుకుంటూ తల్లి ఏడుస్తూ..కూర్చుంది... నాన్న లేవరా అంటూ తల్లి ప్రేమను కురిపించింది...దీంతో మరికాసెపట్లో ఖననం చేసే సమయంలో ఒక్కసారిగా లేచి కూర్చుకున్నాడు..ఈ షాకింగ్ న్యూస్ హర్యానాలో హల్చల్ చేస్తోందని పలు దినపత్రికలు పత్రికలు కథనాన్ని వెళ్లడించాయి.
అయితే చనిపోయిన వ్యక్తి తిరిగి రావడం అనేది ఆసాధ్యం.. కాని బాలుడికి కొన ఊపిరి ఉన్నా...వైద్యులు చనిపోయాడని దృవీకరించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి..లేదంటే నిజంగానే ఇలా జరిగిందా అనే అనుమాలు ఉన్నాయి..ఏది ఏమైనా చనిపోయిన వ్యక్తి బతికి బట్టకట్టడడం అనేది మిస్టరీని చేధించాల్సిన అవసరం వైద్యులకు ఉంది.
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని బహదూర్గఢ్ ప్రాంతానికి చెందిన హితేష్, ఝాన్వి దంపతులకు ఆరేండ్ల కుమారుడు జ్వరం రావడంతో చికిత్స ఇప్పించేందుకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, హితేష్ చికిత్స పొందుతూ..మే 26 న చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో హతేష్ మృతదేహంతో తల్లిదండ్రులు హర్యానాకు తిరిగొచ్చారు. అంత్యక్రియలు చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.ఇక రాత్రంతా పిల్లాడి శవం వద్ద ఏడుస్తూ... తల్లిదండ్రులు గడిపారు.
అయితే ఏడుస్తునన క్రమంలో లేచి కూర్చో నాన్నా.. అంటూ తల్లి అమాయకంగా పిల్లాడ్ని మృతదేహాన్నిఅటూ ఇటూ కదిపిందట... దాంతో పిల్లాడి శరీరంలో కదలిక కనిపించింది..దీంతో ఒక్కసారి ఆశ్చర్యపోయిన తండ్రి వెంటనే తేరుకుని పిల్లాడి శరీరాన్ని ప్యాకింగ్ నుంచి వేరు చేసి నోటి ద్వారా శ్వాస అందించాడు. అనంతరం పక్కనే ఉన్న మరో యువకుడు పిల్లాడి ఛాతీపై గట్టిగా రుద్దడంతో ఒక్కసారి పిల్లాడి గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది.
దాంతో చికిత్స నిమిత్తం పిల్లాడ్ని హుటాహుటిన రోహతక్ ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తిగా కోలుకున్న బాలుడిని మంగళవారం ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయాడనుకున్న బాలుడు లేచి కూర్చోవడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇది అంతా అమ్మ ప్రేమ అంటూ ప్రచారం చేస్తున్నారు..అమ్మ ప్రేమ కోసం బాలుడు తిరిగి వచ్చాడని చర్చించుకుంటున్నారు.
అయితే జరిగిన సంఘటనపై ప్రభుత్వ వర్గాలు కాని, వైద్య వర్గాలు కాని ఎలాంటీ ప్రకటన చేయలేదు...దీంతో ఎలా జరిగి ఉంటుందనే విషయమై ప్రభుత్వం విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అయితే పిల్లాడు బతికిన వార్త బయటకు రావడంతో ప్రభుత్వం ఎలాంటీ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Haryana