Home /News /national /

A BIG SHOCK FOR PIZZA LOVERS YOU CAN NO LONGER ORDER IN THOSE APPS UMG GH

Domino’s Pizza: పిజ్జా లవర్స్‌కు పెద్ద షాక్? ఇకపై ఆ యాప్‌లలో ఆర్డర్ చేయలేరు.. కారణం తెలిస్తే అయ్యో అంటారు !

 పిజ్జా  లవర్స్ కు పెద్ద షాక్? ఇకపై ఆ యాప్ లలో ఆర్డర్ చేయలేరు..  కారణం తెలిస్తే అయ్యో అంటారు !

పిజ్జా లవర్స్ కు పెద్ద షాక్? ఇకపై ఆ యాప్ లలో ఆర్డర్ చేయలేరు.. కారణం తెలిస్తే అయ్యో అంటారు !

డొమినోస్‌ పిజ్జాను (Domino’s Pizza) చాలామంది ఆహార ప్రియులు ఇష్టపడుతుంటారు. జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌లో వాటి కోసం ఎక్కువగా ఆర్డర్‌లను ఇస్తుంటారు. అయితే మరికొద్ది రోజుల్లో ఈ రెండు యాప్స్‌లో పిజ్జాలను ఆర్డర్ చేయడం కుదరకపోవచ్చు.

ఇంకా చదవండి ...
డొమినోస్‌ పిజ్జాను (Domino’s Pizza) చాలామంది ఆహార ప్రియులు ఇష్టపడుతుంటారు. జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌లో వాటి కోసం ఎక్కువగా ఆర్డర్‌లను ఇస్తుంటారు. అయితే మరికొద్ది రోజుల్లో ఈ రెండు యాప్స్‌లో పిజ్జాలను ఆర్డర్ చేయడం కుదరకపోవచ్చు. ఎందుకంటే డొమినోస్‌ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ జొమాటో, స్విగ్గీల ఆర్డర్‌లను తీసుకోకూడదని యోచిస్తోంది. ` కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కి సంబంధించిన ఒక ప్రైవేటు ఫైల్‌లో డొమినో నిర్వహణ సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ (Jubilant FoodWorks) ఈ వివరాలు పేర్కొంది.

"కమీషన్ల రేట్లు ఇంకా పెరిగితే.. జూబిలెంట్ తన మరిన్ని వ్యాపారాలను ఆన్‌లైన్ రెస్టారెంట్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఇన్-హౌస్ ఆర్డర్ సిస్టమ్‌కు మార్చాలని యోచిస్తోంది" అని జులై 19న CCIకి రాసిన లేఖలో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ పేర్కొంది. జొమాటో, స్విగ్గీ యాంటీ కాంపిటేటివ్ పద్ధతులపై విచారణలో భాగంగా CCI డొమినోస్‌ ఇండియా, అనేక ఇతర రెస్టారెంట్ల నుంచి అభిప్రాయాలను కోరింది. ఇందులో భాగంగా డొమినోస్‌ ఇండియా భారతదేశంలో జులై నెలలో తన వ్యాపారంలో దాదాపు 27 శాతం మొబైల్ యాప్, వెబ్‌సైట్‌తో సహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి జరిగినట్లు వెల్లడించింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ఈ యాప్‌లు విపరీతమైన కమీషన్లతో పాటు ఇతర యాంటీ కాంపిటీటివ్ పద్ధతులను అనుసరిస్తున్నాయని ఆరోపించిన తర్వాత CCI ఏప్రిల్‌లో జొమాటో, స్విగ్గీలపై విచారణ ప్రారంభించింది.

జొమాటో, స్విగ్గీలు వసూలు చేసే కమీషన్లు 20-30 శాతం వరకు ఉన్నాయని రెస్టారెంట్ అసోసియేషన్ ఆరోపించింది. డొమినోస్‌, అనేక ఇతర రెస్టారెంట్లకు జొమాటో, స్విగ్గీ కమీషన్లు ఆందోళన కలిగిస్తున్నాయని ఒక అధికారి వెల్లడించారు. "కమీషన్లను మరింత పెంచితే, అవి వ్యాపారాల లాభాల క్షీణతకు దారితీస్తాయి. అలానే కస్టమర్ల(Customer)పై భారం పెరుగుతుంది" అని అన్నారు.

ఇదీ చదవండి: china-India tension: మిసైల్ పరీక్ష తో మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్ దిమ్మతిరిగే సమాధానం..



జొమాటో, స్విగ్గీపై CCI విచారణ

ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ అనైతిక వ్యాపార పద్ధతులపై దర్యాప్తునకు ఏప్రిల్‌లో CCI ఆదేశించింది. అందుకుముందు రెస్టారెంట్ పార్ట్నర్‌లతో ఈ సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై NRAI ఆందోళనలు లేవనెత్తింది. కంపెనీలు తమ సేవలను కొన్ని బ్రాండ్‌లకు అదనపు ఫీజులు లేదా అద్దె కమీషన్ల కోసం అందిస్తున్నాయని ఆరోపించింది.



ప్రత్యేక కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత కల్పిస్తూ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ కంపెనీలపై దర్యాప్తు చేయాలని NRAI CCIని కోరింది. క్లౌడ్ కిచెన్‌లను ఏర్పాటు చేయడానికి జొమాటో కస్టమర్ల డేటాను ఉపయోగించిందని కూడా ఆరోపించింది. అయితే ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జొమాటో సంబంధిత చట్టాలకు లోబడి ఉన్నట్లు కాంపిటీషన్ వాచ్‌డాగ్‌కు వివరిస్తామని, కమిషన్ తమకిచ్చిన అంశాలను పాటిస్తామని తెలిపింది.
Published by:Mahesh
First published:

Tags: Food delivery, Pizza, Swiggy, Zomato

తదుపరి వార్తలు