హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BGMI: గేమింగ్ లవర్స్ కు పెద్ద షాక్.. మరో గేమ్ ను బ్యాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ !

BGMI: గేమింగ్ లవర్స్ కు పెద్ద షాక్.. మరో గేమ్ ను బ్యాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ !

 గేమింగ్ లవర్స్ కు పెద్ద షాక్.. మరో గేమ్ ను బ్యాన్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ !

గేమింగ్ లవర్స్ కు పెద్ద షాక్.. మరో గేమ్ ను బ్యాన్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ !

ఇండియాలో మరో మొబైల్ గేమ్ బ్యాన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాప్ మొబైల్ గేమ్స్‌లో ఒకటైన బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా.. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించట్లేదు. దీంతో దీన్ని ప్రభుత్వం నిషేధించిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

ఇండియాలో మరో మొబైల్ గేమ్(Game) బ్యాన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాప్ మొబైల్(Mobile) గేమ్స్‌లో ఒకటైన బ్యాటిల్‌ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా.. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్(Google) ప్లే స్టోర్‌లో కనిపించట్లేదు. దీంతో దీన్ని ప్రభుత్వం నిషేధించిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. BGMIని యాప్ స్టోర్స్‌ నుంచి ఎందుకు తొలగించారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే దీనిపై చాలా మంది ట్విట్టర్(Twitter) యూజర్లు స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఈ గేమ్‌ను నిషేధించిందేమోనని భయపడుతున్నారు. PUBGకి పట్టిన గతే BGMIకి కూడా పట్టినట్లు కొందరు జోకులు పేల్చుకుంటున్నారు. గతంలో ఇండియాలో టాప్ మొబైల్ గేమ్‌గా ఉన్న PUBGని రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది.

పబ్జీ పేటెంట్‌ రైట్స్‌ను చైనాకు చెందిన టెన‍్సెంట్‌ కంపెనీ దక్కించుకొని, కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే చైనా మూలాలు ఉన్నందువల్ల ఈ గేమ్‌ను భారతదేశం నిషేధించింది. దీంతో PUBGని ఇండియా బ్యాన్ చేసిన తర్వాత దక్షిణ కొరియా కంపెనీ క్రాఫ్టన్ కంపెనీ ఈ గేమ్‌ను బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియాగా (BGMI) మార్పులు చేసి విడుదల చేసింది. కానీ ఈ రెండు గేమ్స్ ఒకే విధంగా ఉంటాయి.

అయితే తాజా విషయంపై తమకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వు అందిందని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘ఆర్డర్ అందిన తర్వాత ఈ విషయాన్ని మేము డెవలపర్‌కు తెలియజేశాం. భారతదేశంలోని ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న యాప్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేశాం’ అని ఆ ప్రతినిధి ఒక వార్తాసంస్థతో చెప్పారు. ఈ నేపథ్యంలో గేమ్ మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కొందరు, ప్రభుత్వం గేమ్‌ను నిషేధించిందని మరికొందరు ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Pink Diamond: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !



‘భారతదేశంలో BGMIని బ్యాన్ చేశారని సోర్సెస్ ధ్రువీకరించాయి’ అని ఒక యూజర్ రాశారు. ‘ప్లే స్టోర్‌లో లేదా BGMI టీమ్‌లో టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. గేమ్ బ్యాన్ అయిందని నేను అనుకోను’ అని మరొకరు రాశారు. ‘కారణం ఎవరికీ తెలియదు. బెటర్ అనౌన్స్‌మెంట్ కోసం ఆశిద్దాం. ఇంతకు ముందు PUBG మొబైల్ గేమ్‌ను బ్యాన్ చేశారు. BGMIలో బగ్స్, ఇతర లోపాలు ఉండవచ్చు, వాటిని అప్‌డేట్ చేసి గేమ్‌ను రిలీజ్ చేయవచ్చు. అంతమాత్రాన గేమ్‌ను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు’ అని మరొకరు రాశారు.

భారతదేశంలో BGMI బ్యాన్ అయిందా లేదా అనేదానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటన చేయలేదు. 2020 తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం వాస్తవ నియంత్రణ రేఖను అతిక్రమించడానికి ప్రయత్నించినప్పటి నుంచి చైనా యాప్స్‌పై భారత్ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఈ క్రమంలో కొన్ని వందల యాప్స్‌ను ఇండియా బ్యాన్ చేసింది.

First published:

Tags: BGMI, Google Play store, PUBG, Twitter

ఉత్తమ కథలు