A BABY GIRL WAS BORN ON BOARD AN INDIGO FLIGHT FROM BENGALURU TO JAIPUR SK
గాల్లో విమానం.. గర్భిణీకి ఒక్కసారిగా పురిటినొప్పులు.. తర్వాత ఏం జరిగింది?
ప్రతీకాత్మక చిత్రం
విమాన సిబ్బంది సాయంతోనే గర్భిణికీ పురుడు పోశారు డాక్టర్ సుభానా నీజర్. అలా గాల్లో విమానంలోనే ఆ మహిళ పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఓ నిండు గర్భిణీ విమానం ఎక్కింది. విమానం బయలుదేరిన తర్వాత ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఫ్లైట్ చాలా దూరం వచ్చేసింది. ముందుకు వెళ్లాలన్న టైమ్ పడుతుంది. వెనక్కు వెళ్లాలన్నా అదే పరిస్థితి. కానీ ఆ గర్భిణి పురిటి నొప్పులతో అల్లాడుతోంది. మరి విమాన సిబ్బంది ఏం చేశారు? బుధవారం ఉదయం 05.45కి బెంగళూరు నుంచి జైపూర్‌కు ఇండిగో ఫ్లైట్ బయలు దేరింది. టేకాఫ్ అయిన కాసేపటికి..ఓ మహిళకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. విమానం అప్పటికే సగం దూరం వచ్చేసింది. సమీపంలోని ఎయిర్‌పోర్టులోకి వెళ్లాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ఆ మహిళమో పురిటి నొప్పులతో విలవిల్లాడుతోంది.
అప్పుడు ఇండిగో సిబ్బంది ఫ్లైట్‌లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. మీలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అడిగారు. వెంటనే ఒక మహిళ లేచి.. నేను ఉన్నాను అని తెలిపారు. ఆమె పేరు సుభానా నజీర్. మీ హెల్ప్ కావాలి మేడం.. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతోందని విమాన సిబ్బంది చెప్పారు. ''ఒకే అని నేను చూసుకుంటాను..'' అని ఆమె తెలిపారు. అనంతరం విమాన సిబ్బంది సాయంతోనే గర్భిణికీ పురుడు పోశారు డాక్టర్ సుభానా నీజర్. అలా గాల్లో విమానంలోనే ఆ మహిళ పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
A baby girl was born on board an IndiGo flight from Bengaluru to Jaipur. Baby was delivered with the help of crew assisted by a doctor on board. Jaipur airport was immediately informed to arrange for a doctor and an ambulance on arrival. Both the baby & mother are stable: IndiGo
మరికాసేపట్లో విమానం జైపూర్ ల్యాండ్ అవబోతోందని.. ఆ మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు అధికారులకు చెప్పారు. వారు చెప్పినట్లుగానే అంబులెన్స్ ఏర్పాటుు చేసి.. తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. ఇక విమానంలో మహిళకు పురుడుపోసిన డాక్టర్ సుభానా నజీర్‌కు ఇండిగో సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. జైపూర్ ఎయిర్‌పోర్టులో ఆమెకు థ్యాంక్స్ కార్డు అందజేశారు.
Baby girl 👧🏻 born onboard @IndiGo6E flight 6E 469 from Bengaluru to Jaipur!
Baby delivered with the help of IndiGo crew & Dr Subahana Nazir who was travelling on the flight.
కాగా, గత ఏడాది అక్టోబరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లిన ఇండిగో విమానంలో ఓ మహిళ పండండి మగశిశువుకు జన్మనిచ్చింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.