ఓటు హక్కు వినియోగించుకున్న 107 సంవత్సరాల వృద్ధ మహిళకు అరుదైన సన్మానం...

107 ఏళ్ల వృద్ధురాలు సుమిత్రా రాయ్ తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

news18-telugu
Updated: October 21, 2019, 10:56 PM IST
ఓటు హక్కు వినియోగించుకున్న 107 సంవత్సరాల వృద్ధ మహిళకు అరుదైన సన్మానం...
ఓటు హక్కు వినియోగించుకున్న 107 సంవత్సరాల వృద్ధ మహిళకు అరుదైన సన్మానం...
  • Share this:
107 ఏళ్ల వృద్ధురాలు సుమిత్రా రాయ్ తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. సిక్కింలోని కమరాంగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం జరిగిన ఉపఎన్నికలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలోని ఓటర్లందరిలో ఆమె అతి పెద్ద వయస్కురాలు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఓటేయడానికి ముందు ఎన్నికల అధికారులు ఆమెను సన్మానించారు. కమరాంగ్ పోలింగ్ స్టేషన్‌లో ప్రభుత్వ పాఠశాలలో సుమిత్రారాయ్ ఓటేశారు. ఇదిలా ఉంటే సిక్కింలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. సోమవారం ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. దేశంలో 17 రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 51 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్‌సభ సీట్లకు సోమవారం ఉప ఎన్నికలు జరిగాయి.
Published by: Krishna Adithya
First published: October 21, 2019, 10:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading