PM Modi in Maan Ki Baat : భారత్ పురోగతిలో 'నారీ శక్తి' కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇవాళ 99వ మన్ కీ బాత్ కార్యక్రమంలో(ఈ ఏడాది మూడోది) మోదీ మాట్లాడుతూ..నేడు, భారతదేశం యొక్క సామర్థ్యం కొత్త దృక్కోణం నుండి ఉద్భవించింది, అందులో మన మహిళా శక్తి చాలా పెద్ద పాత్రను కలిగి ఉందన్నారు. మోదీ మాట్లాడుతూ..'ది ఎలిఫెంట్ విస్పరర్స్' అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం ద్వారా నిర్మాత గునీత్ మోంగా మరియు డైరక్టర్ కార్తికి గోన్సాల్వేస్ దేశానికి ప్రశంసలు తెచ్చారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశం యొక్క అండర్ -19 మహిళా క్రికెట్ జట్టు T-20 ప్రపంచ కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. భారతదేశం యొక్క నారీ శక్తి ముందు నుండి ముందంజలో ఉంది. వర్ధమాన భారత శక్తిలో.. మహిళా శక్తి గణనీయమైన పాత్ర పోషిస్తోంది. నాగాలాండ్‌లో 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇద్దరు మహిళా శాసనసభ్యులు విధానసభకు చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి మిషన్(UN Mission)కింద శాంతి పరిరక్షణలో మహిళలకు మాత్రమే ఉండే ప్లాటూన్‌ను కూడా భారత్ మోహరించింది. మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు"అని అన్నారు.
రకరకాల పండుగలు వస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అన్ని మతాల వారికీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సజా చాలా పండుగలు వస్తున్న సమయంలో.. ఈ కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కరోనాను తక్కువ అంచనా వేయవద్దనీ, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ కోరారు. "పండుగలు ఉత్సాహంగా జరుపుకోండి.. కానీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి" అని మోదీ కోరారు. వచ్చే నెలలో జరగనున్న 100వ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రతి ఒక్కరూ సూచనలను అందించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కోరారు. దేశంలో అవయవదానంపై అవగాహన పెరుగుతోందిని ప్రధాని మోదీ అన్నారు. అవయవ దానం అనేది వేరొకరికి జీవితాన్ని అందించడానికి చాలా ముఖ్యమైన సాధనంగా మారిందని.. ఒక వ్యక్తి మరణానంతరం ఒకరి శరీరాన్ని దానం చేస్తే, అది ఎనిమిది నుండి తొమ్మిది మందికి కొత్త జీవితాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పబడిందని మోదీ గుర్తుచేశారు. 2013లో దేశంలో 5,000 కంటే తక్కువ అవయవ దానం కేసులు నమోదయ్యాయి, అయితే 2022 నాటికి అది 15,000 కంటే ఎక్కువకు పెరిగిందన్నారు. నేడు దేశంలో అవయవదానంపై అవగాహన పెరుగుతుండడం సంతృప్తిని కలిగించే విషయమని ప్రధాని అన్నారు.
ISRO : దుమ్ముదులుపుతున్న ఇస్రో.. 36శాటిలైట్స్ తో నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం3
మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రతినెలా చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ.. 2014 అక్టోబర్ 3న తొలి మన్ కీ బాత్ ప్రసంగం చేశారు. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతీ నెలా చివరి ఆదివారం ఓ ఎపిసోడ్ చేస్తున్నారు. ఇప్పుడు విజయవంతంగా 99 ఎపిసోడ్లు పూర్తయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mann Ki Baat, Pm modi