99th Mann ki baat : కరోనాపై అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన 99వ మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు.
ఇండియాలో 5 వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే.. త్వరలో చాలా పండుగలు కూడా రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇదే అంశాన్ని ప్రధాని మోదీ .. ఇవాళ తన 99వ మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
రకరకాల పండుగలు వస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అన్ని మతాల వారికీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సజా చాలా పండుగలు వస్తున్న సమయంలో.. ఈ కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కరోనాను తక్కువ అంచనా వేయవద్దనీ, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ కోరారు. "పండుగలు ఉత్సాహంగా జరుపుకోండి.. కానీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి" అని మోదీ కోరారు.
Sharing this month's #MannKiBaat. Tune in! https://t.co/cszqdBTMFc
— Narendra Modi (@narendramodi) March 26, 2023
ఇండియాలో నిన్న కొత్తగా 1,890 కరోనా కేసులు నమోదయ్యాయి. 149 రోజుల్లో ఇవే అత్యధికం. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,433కి చేరింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. నిన్న కొత్తగా ఏడుగురు చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,831కి చేరింది. ఇప్పటివరకూ 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది.
ఈ ఎపిసోడ్ 99వది కావడం ప్రత్యేకం అనుకోవచ్చు. వచ్చే ఏప్రిల్ చివరి ఆదివారం ఆయన 100వ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం చేయనున్నారు. మోదీ మొదటిసారి.. 2014 అక్టోబర్ 3న తొలి మన్ కీ బాత్ ప్రసంగం చేశారు. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతీ నెలా ఓ ఎపిసోడ్ చేస్తున్నారు. ఇప్పుడు విజయవంతంగా 99 ఎపిసోడ్లు పూర్తయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mann Ki Baat, Narendra modi