Home /News /national /

99 PERCENT OF THE WORLDS POPULATION WILL BE BASKING IN SUNLIGHT ON JULY 8 HERES THE TRUTH PVN

Wonder : ఆకాశంలో ఇవాళ అద్భుతం...భూమిపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై సూర్యకాంతి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sunlight on 99 percent people : జూలై 8న భూమిపై అద్భుతం జరుగనుంది.. ప్రపంచం ప్రకాశవంతంగా ప్రకాశించే రోజు ఇది..భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై జూలై 8న ఉదయం 11.15 గంటలకు(UTC)(భారత్‌ లో సాయంత్రం 4.45 గంటలకు) ఒకేసారి సూర్యకాంతి పడనునందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇంకా చదవండి ...
    Sunlight on 99 percent people : జూలై 8న భూమిపై అద్భుతం జరుగనుంది.. ప్రపంచం ప్రకాశవంతంగా ప్రకాశించే రోజు ఇది..భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై జూలై 8న ఉదయం 11.15 గంటలకు(UTC)(భారత్‌ లో సాయంత్రం 4.45 గంటలకు) ఒకేసారి సూర్యకాంతి(Sun Light) పడనునందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సమయంలో.. ప్రపంచ జనాభాలో దాదాపు 99.164 శాతం మంది తెల్లవారుజాము- సాయంత్రం మధ్య ఉంటారు కాబట్టి వీరందరూ సూర్యరశ్మిని స్వీకరిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనంలో పేర్కొనబడింది. సాధారణంగా భూమిపై ఒకవైపు పగలు ఉంటే, మరోవైపు రాత్రి సమయం ఉంటుంది.

    కానీ, శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్‌, ఆఫ్రికా, ఆసియాలో అత్యధిక భాగంపై ఒకేసారి సూర్యకాంతి ప్రసరించనున్నదని రెడ్డిట్‌( Reddit)లో గిడ్డీస్వైన్‌ అనే వ్యక్తి పోస్టు చేశారు. కొద్దిసేపట్లోనే ఈ పోస్టు వైరల్‌గా మారింది. అయితే అది ఎంతవరకు నిజం? అనే విషయాన్ని తెలుసుకునేందుకు timeanddate.com నుండి "నంబర్ క్రంచర్స్" అనే ఓ బృందం ప్రయత్నించింది.



    IRCTC Thailand Tour : రూ.40 వేలకే థాయిలాండ్ ట్రిప్..IRCTC స్పెషల్ ప్యాకేజీ వివరాలివే

    పగటిపూట ఉత్తర అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా వంటి ప్రాంతాలను మ్యాప్ చూపింది, అయితే రాత్రి వైపు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,ఆగ్నేయాసియా, అంటార్కిటికాలను మ్యాప్ చూపించింది. సూర్యకాంతి యొక్క నిర్దేశిత విభజనను విశ్లేషించిన తర్వాత timeanddate.com బృందం...సోషల్ మీడియాలో పోస్ట్ లో చేసిన వాదన దాదాపు నిజమేనని కనుగొంది. భూమిపై 6.4 బిలియన్లకు పైగా ప్రజలు పగటి వెలుగులో ఉంటారని, వారిలో 1.2 బిలియన్ల మంది సంధ్యా సమయాన్ని అనుభవిస్తారని వారు కనుగొన్నారు. మరో మాటలో చెప్పాలంటే, మొత్తం జనాభాలో 83 శాతం మందిపై సూర్యకాంతి స్పష్టంగా, 16 శాతం మందిపై తక్కువగా పడుతుందని తెలిపారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో మాత్రమే ఆ సమయంలో చీకటి ఉంటుందని తెలిపారు. రాత్రిని అనుభవించే భాగం కేవలం 79.7 మిలియన్లు, ఇది మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం అని తెలిపారు.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: Earth, Sun

    తదుపరి వార్తలు