news18-telugu
Updated: November 11, 2019, 8:29 AM IST
న్యూస్18 క్రియేటివ్
Ayodhya Case Verdict : అయోధ్య కేసులో తీర్పు వచ్చిన రెండ్రోజుల్లో దేశవ్యాప్తంగా 90 మంది అరెస్టయ్యారు. వీరిలో 72 మంది ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే అరెస్టైనట్లు తెలిసింది. వీరిలో 40 మంది సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెట్టి బుక్కైనవారే. సోషల్ మీడియాలో అడ్డమైన 8,275 పోస్టులను పోలీసులు తొలగించడమే కాదు... ఆ పోస్టులు పెట్టిన వాళ్లపై కేసులు కూడా రాశారు. ఎక్కువ మంది ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో అడ్డమైన పోస్టులు పెట్టారు. తీర్పు సందర్భంగా బాణసంచా కాల్చి... ఆ ఫొటోలను అప్లోడ్ చేసినవాళ్లపై సైతం పోలీసులు కేసులు రాశారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తప్పులు చేసే వాళ్లను వెంటనే అరెస్టు చెయ్యకపోవచ్చుగానీ... ఆ కేసులైతే అలాగే కొనసాగుతాయి. అందువల్ల ఎప్పటికైనా వివాదాస్పద పోస్టులు పెట్టిన వారికి చిక్కులు తప్పవు.
అయోధ్య కేసులో తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడా, ఏ సమస్యా రాలేదు. ఎలాంటి అల్లర్లూ, గొడవలూ జరగలేదు. ప్రజలు ఈ తీర్పును లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆల్రెడీ ఆ భూమి హిందువులకే సుప్రీంకోర్టు ఇస్తుందని దేశ ప్రజలు ముందే అనుకున్నారనీ... అలాగే జరగడంతో... పెద్దగా తీర్పుపై ఆశ్చర్యపోలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిఘా కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఏవైనా దాడులు చేస్తారేమోనని అన్ని రాష్ట్రాలూ అలర్ట్ అయ్యాయి. అలాగే... తీర్పు ఇచ్చిన ఐదుగురు న్యాయమూర్తులకూ భద్రత మరింత పెంచారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌కి జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పిస్తున్నారు. అదనపు దళాలను, బారికేడ్లను, మొబైల్ హెల్పింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
Pics : ఈ బెంగాలీ రసగుల్ల అందమే అందం...
ఇవి కూడా చదవండి :
జబర్దస్త్ రష్మీ, సుధీర్ మధ్య పెరిగిన గ్యాప్...? ఇవీ కారణాలుబెంగాల్పై బుల్బుల్ తుఫాను బీభత్సం... ఏడుగురు మృత్యువాత
ఆర్టీసీ సమ్మెపై నేడు ఫైనల్‌గా తేల్చనున్న హైకోర్టు...
క్లైమాక్స్‌కి మహారాష్ట్ర కహానీ... శివసేన సర్కార్ ఏర్పడే ఛాన్స్
ఏపీని ఆత్మహత్యలప్రదేశ్ చేశారు... వైసీపీపై చంద్రబాబు సెటైర్లు
Published by:
Krishna Kumar N
First published:
November 11, 2019, 8:29 AM IST