హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Khammam : సల్వాజుడుం రూపకర్త మహేంద్రకర్మ హత్య, నేటికి 9 ఏళ్లు..అయినా..ఆగని మారణహోమం

Khammam : సల్వాజుడుం రూపకర్త మహేంద్రకర్మ హత్య, నేటికి 9 ఏళ్లు..అయినా..ఆగని మారణహోమం

సల్వాజుడుం రూపకర్త మహేంద్రకర్మ హత్య, నేటికి 9 ఏళ్లు

సల్వాజుడుం రూపకర్త మహేంద్రకర్మ హత్య, నేటికి 9 ఏళ్లు

Salwajudum :దేశంలో సంచలనం సృష్టించిన మావోయిస్టుదాడుల్లో మంత్రి మహేంద్రకర్మ హత్య ఒకటి..సల్వాజుడుం పేరుతో మావోలను అడ్డుకున్న ఆయన్ను తోమ్మిదేళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజు వేలాది మంది మావోలు చుట్టుముట్టి బుల్లెట్ల వర్షంతో తుదముట్టించారు.

ఇంకా చదవండి ...

జి. శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా ప్రతినిధి

బస్తర్ టైగర్ గా పేరుగాంచిన, మాజీ మంత్రి,సల్వాజుడుం సృష్టి కర్త,మహేంద్ర కర్మ ను దారుణంగా చంపిన పర్సెగడ్ ఘటనకు నేటితో తొమ్మిది ఏళ్ళు. నాడు మావోయిస్టులు కాపుగాచి పక్కా వ్యూహంతో ఓ సభకు హాజరై తిరిగి వస్తుండగా దంతెవాడ జిల్లా పర్సెఘడ్ అటవీ ప్రాంతంలో పోలీసులపై, కర్మ కాన్వాయ్ పై వేలాది మంది మావోయిస్టులు భారీగా ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని బులెట్ ల వర్షం కురిపించారు.

ఈ ఘటనలో ఓ కేంద్ర మంత్రి కూడా తీవ్రంగా గాయపడి మూడు రోజుల తర్వాత మృతి చెందారు. ఆయన మంత్రి అని గుర్తించక పోవటంతో తన అనుచరులు కూడా ఈ ఘటన లో మావోయిస్టుల నుండి తప్పించుకున్నారు. మహేంద్ర కర్మ వాహనం అత్యాధునికమైన బులెట్ ప్రూఫ్ కావడంతో... ఐఇడీ తో దాడిచేసినా కర్మ వాహనం తలుపులు తెరవలేక పోయారు, దీంతో మావోయిస్టులు కర్మతో పాటు వున్న, కార్యకర్తలను, అనుచరులను, పోలీసులను అదుపులోకి తీసుకున్నారు..

వాహనం దిగి బయటికి రాకపోతే, వీరందరినీ చంపేస్తామని హెచ్చరించారు. లేదంటే నువు వస్తే నిన్ను మాత్రమే చంపి మిగిలిన వారిని వదిలిపెడతామనటంతో, మహేంద్ర కర్మ వాహనం దిగి తమ అనుచరులకు భయపడకండి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తున్నానని చెప్పి వాహనం లోపల వున్న తన డ్రైవర్ ,కొంత మంది అనుచరులతో చెప్పి వాహనం నుంచి బయటకు రావటం , సెకన్ల లో వందల బుల్లెట్లు కర్మ శరీరాన్ని తునాతునకలు చేశాయి.

అనంతరం కర్మ మృతదేహాన్ని సైతం మావోలు కసిగా తొక్కి మావోయిస్టు పార్టీని అంతమొందిస్తానన్న దుష్ట శక్తి మా చేతిలో నేడు హతం అయిందని ,నినాదాలు చేస్తూ అడవిలోకి వెళ్ళారని ప్రత్యేక్ష సాక్షుల కథనాలను మీడియా ప్రసారం చేసింది. కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న మహేంద్రకర్మ, సల్వాజుడుం సృష్టితో మావోయిస్టు ఉద్యమాన్ని కొన్ని దశాబ్దాల పాటు నిలువరించగలిగారు.

First published:

Tags: Maoist attack

ఉత్తమ కథలు