news18-telugu
Updated: November 24, 2019, 9:35 PM IST
తగలబడుతున్న వాహనాలు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లాలో 9 వాహనాలను తగులబెట్టారు. బలైదిలా ప్రాంతంలో NMDC ప్లాంట్ పనులు జరుగుతుండగా మావోయిస్టులు వచ్చి సిబ్బందిని బెదిరించారు. అనంతరం అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మూడు జేసీబీలు, ఆరు డంపర్ ట్రక్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్లాంట్ పనులను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యారు. కాలిపోయిన వాహనాలన్నీ ప్లాంట్ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్వని సిబ్బంది తెలిపారు.
ఇక శనివారం నారాయణ్‌పూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. చిన్న డోంగార్ పీఎప్ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సుమారు 300 మంది మావోయిస్టులు వచ్చి రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి.. చెట్లకు కరపత్రాలు అంటించారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల వరుస ఘటనల నేపథ్యంలో సాయుధ బలగాలు అప్రమత్తమై అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి.
Published by:
Shiva Kumar Addula
First published:
November 24, 2019, 9:34 PM IST