HOME »NEWS »NATIONAL »9 months old child swallowed the cap of a tonic bottle in orissa nk

టానిక్ సీసా మూత మింగేసిన చిన్నారి... డాక్టర్లు ఏం చెప్పారంటే...

టానిక్ సీసా మూత మింగేసిన చిన్నారి... డాక్టర్లు ఏం చెప్పారంటే...
టానిక్ సీసా మూత మింగేసిన చిన్నారి... డాక్టర్లు ఏం చెప్పారంటే... (ప్రతీకాత్మక చిత్రం)

Orissa : చిన్న పిల్లల్ని ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. వాళ్లు చేతికి ఏది దొరికితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా ఓ చిన్నారి టానిక్ సీసా మూత నోట్లో పెట్టుకొని మింగేశాడు.

  • Share this:
    Orissa : చిన్న పిల్లలు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటే... చూడటానికి చాలా బాగుంటుంది. వాళ్ల ముఖాల్లో అమాయక చూపులు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఐతే... అలా ఆడుకుంటూ... ఆడుకుంటూ ఆ 9 నెలల చిన్నారి... నోట్లో ఏదో పెట్టుకున్నాడు. ఆ తర్వాత... నేలపై పడి... గిలగిలా కొట్టుకుంటుంటే... అప్పటివరకూ ఆ పిల్లాడితో (తమ్ముడితో) ఆడుకున్న నాలుగేళ్ల సాత్విక్...
    వంట పనిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లి... వచ్చీ రాని మాటలతో అసలు విషయం చెప్పాడు... "తమ్ముడు సీసా మూత మింగేశాడని". అంతే... వంట చేస్తున్న తల్లి షాకైంది. చేతిలో గరిటె, స్టవ్‌పై కూరను అలాగే వదిలేసి... వెంటనే పక్క గదిలోకి వచ్చి చిన్నారిని "ఏం నాన్నా... చిచ్చీ బుజ్జీ చిట్టి తండ్రీ అంటూ... దగ్గరకు తీసుకుంది. నోట్లో మూత తీద్దామని చూస్తే... చిన్నారి సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడని గమనించింది. ఆ పక్కన నేలపై టానిక్ బాటిల్ ఉంది. దాని మూత మాత్రం లేదు. అంతే... వెంటనే ఇంటి బయట ఉన్న భర్త యోగేశ్వరరావుకి విషయం చెప్పింది. అలా... మొత్తం ఫ్యామిలీ... ఆ చిన్నారిని గబగబా సోంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.



    ఆ టైంలో ఏదో బిజీలో ఉండి కూడా డాక్టర్లు వెంటనే స్పందించారు. అరెరే అంటూనే తమ దగ్గరున్న ప్రత్యేక వైద్య పరికరాల్ని చిన్నారి గొంతులోకి పంపి... అత్యంత జాగ్రత్తగా టానిక్ సీసా మూతను బయటకు తీశారు. దాంతో చిన్నారి మళ్లీ ఊపిరి సరిగా పీల్చుకోవడం మొదలుపెట్టాడు. దాంతో... అంతా ఊపిరి పీల్చుకున్నట్లైంది. ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఏం చెప్పారంటే... ఆ మూత గొంతులోకి వెళ్లి అక్కడ ఆగిపోయిందనీ, అదే ఆ మూత లోపలికి వెళ్లి ఉంటే... మరింత ప్రమాదం అయ్యేదని తెలిపారు. అలాగే... ముత మరోవైపు తిరిగినా చిన్నారికి ఊపిరి ఆగిపోయేదేనని తెలిపారు. అంటే లక్ అనుకోవాలి. మొత్తానికి చిన్నారి విజయవంతంగా ట్రీట్‌మెంట్ జరగడంతో... ఆ తల్లిదండ్రులు పట్టరాని ఆనందంలో మునిగిపోయారు.

    ఇదీ ఒడిశా... సోంపేటలో జరిగిన ఘటన. ఓ చిన్న మూత... చిన్నారి ప్రాణాలపైకి తెచ్చింది. పిల్లలకు ఏవైనా వస్తువులు, బొమ్మలు ఇచ్చేటప్పుడు... అవి నోట్లో పెట్టుకోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
    Published by:Krishna Kumar N
    First published:February 28, 2020, 12:55 IST

    टॉप स्टोरीज