అయ్యో... జైల్లోకి వరద నీరు... 863 మంది ఖైదీల తరలింపు

Uttarpradesh : ఐదు రోజుల నుంచీ ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలూ ఊళ్లను ముంచెత్తుతున్నాయి. చివరకు జైళ్లలో ఖైదీలపై కూడా వరద నీటి ఎఫెక్ట్ పడింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 30, 2019, 2:29 PM IST
అయ్యో... జైల్లోకి వరద నీరు... 863 మంది ఖైదీల తరలింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Uttarpradesh : ఈమధ్య ఉత్తరప్రదేశ్‌ సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల్లో ఇప్పటివరకూ దాదాపు 90 మంది దాకా చనిపోయారు. యూపీలోని బాల్లియా, జాన్పూర్, వారణాసి జిల్లాలపై అత్యంత తీవ్ర ప్రభావం పడింది. బాల్లియా జిల్లాలోని జైలులోకి వరద నీరు వచ్చేయడంతో... ఖైదీల పరిస్థితి కల్లోలంగా తయారైంది. మూడు బ్యారక్‌లను వరద నీరు ముంచేసింది. సమస్యేంటంటే... బీహార్‌కి సరిహద్దుల్లో... గంగానదికి దగ్గర్లోనే ఈ జైలు ఉంది. ఆ ప్రదేశంలో 27 మంది చనిపోయారు. ఐతే... ఆ జైల్లో పట్టేది 350 మంది ఖైదీలే. కానీ అక్కడ 863 మంది ఉన్నారు. అసలా జైలే కూలిపోయేలా ఉంటుంది. ఆ గోడలు ఎంతో నాసిరకంగా ఉంటాయి. నాలుగు రోజులుగా జైల్లో పరిస్థితి బాలేదు. పోలీసులు ఎంతలా నీటిని తోడి బయటకు పోస్తున్నా... ప్రయోజనం కనిపించలేదు.

ఇక లాభం లేదనుకున్న జైలు అధికారులు... 500 మంది ఖైదీలను అంజఘఢ్ లోని జైలుకు తరలించారు. అక్కడకు వెళ్లిన ఖైదీల్లో 45 మంది మహిళా ఖైదీలున్నారు. బాల్లియా నుంచీ 120 కిలోమీటర్ల దూరంలో అజంఘడ్ జైలు ఉండటం వల్ల ఇక సమస్య ఉండదని అనుకుంటున్నారు. ప్రస్తుతం బాల్లియా జైల్లో మరో 363 మంది ఖైదీలున్నారు. వాళ్లను 200 కిలోమీటర్ల దూరంలోని అంబేద్కర్‌నగర్ జిల్లా జైలుకు తరలించాలని డిసైడయ్యారు.

ఖైదీలను పంపేసినా... జైలు పనిచేస్తూనే ఉంటుందనీ, వరదలు తగ్గిన తర్వాత మళ్లీ ఖైదీలను తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిస్థితి బాలేదు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుల శబ్దాలు భయపెడుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ కామనవుతున్నాయి. ప్రజల కష్టాలకు అంతు లేదు. మరో 24 గంటలు యూపీ, బీహార్, జార్ఖండ్‌లో భారీ వర్షాలు తప్పవని వాతావరణ అధికారులు తెలిపారు.

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. యూపీ, బీహార్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
Published by: Krishna Kumar N
First published: September 30, 2019, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading