హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Exclusive Video: రైతుల ఆందోళనల్లో భద్రతా సిబ్బందిపై బీభత్సంగా దాడి.. వీడియో

Exclusive Video: రైతుల ఆందోళనల్లో భద్రతా సిబ్బందిపై బీభత్సంగా దాడి.. వీడియో

ఢిల్లీలో పోలీసులపై దాడి చేస్తున్న ఆందోళనకారులు

ఢిల్లీలో పోలీసులపై దాడి చేస్తున్న ఆందోళనకారులు

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు ముందుగా చెప్పిన రూట్ మ్యాప్ కంటే భిన్నంగా వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొందరు అల్లరిమూకలు భద్రతా సిబ్బంది మీద దాడి చేశారు.

ఇంకా చదవండి ...

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు ముందుగా చెప్పిన రూట్ మ్యాప్ కంటే భిన్నంగా వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొందరు అల్లరిమూకలు భద్రతా సిబ్బంది మీద దాడి చేశారు. తమను అడ్డుకుంటున్న భద్రతా సిబ్బందిని పెద్ద పెద్ద కర్రలతో కొడుతున్న దృశ్యాలు వెలుగుచూశాయి. కొందరు ఆందోళనకారులు పెద్ద కర్రలతో భద్రతా సిబ్బంది మీద దాడి చేస్తుంటే, ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు పెద్ద గోడ నుంచి కిందకు దూకుతున్నారు. కొందరు 10, 15 అడుగుల ఎత్తయిన గోడను పట్టుకుని వారి దాడిని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. చివరకు పట్టునిలుపుకోలేక జారి పడిపోయారు. ఈ సందర్భంగా వారికి గాయాలు అయ్యాయి. మొత్తం 86 మంది భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరగనుంది. 1.30 నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో హింసాత్మక దృశ్యాలు ఉన్నాయి. నిరసనకారుల దాడి నుంచి తప్పించుకునేందుకు భద్రతా సిబ్బంది విధిలేక గేటు వదిలి పరుగులు తీశారు.

రైతుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అలాగే, భారీగా పారామిలటరీ బలగాలను మోహరించింది. ఢిల్లీతో సరిహద్దు రాష్ట్రాల్లో కూడా అలర్ట్ చేసింది. పంజాబ్, హర్యానాల్లో హై అలర్ట్ ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ రోజు జరిగిన ఘటనలపై సమీక్ష నిర్వహించారు.

అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు ముందుగా చెప్పిన రూట్ మ్యాప్‌ను మార్చి రిపబ్లిక్ డే పరేడ్ మార్గంలోకి దూసుకొచ్చారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటుకుంటూ ఎర్రకోట వైపునకు దూసుకొచ్చారు. వారిని కట్టడిచేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. రైతులపై లాఠీచార్జీ చేశారు. పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నా కూడా రైతులు ట్రాక్టర్లతో దూసుకెళ్లారు. ఎర్రకోట వద్దకు వెళ్లారు. అక్కడ ఎర్రకోట ఎదురుగా ఉన్న మరో స్తంభానికి రైతులు కొందరు రైతుల జెండాను ఎగరవేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులు అందరినీ పంపేసేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు, రైతుల మధ్య జరిగిన ఘర్షణలో రెండు వైపుల వారికి గాయాలయ్యాయి. కొందరు రక్తసిక్తమైన గాయాలతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు రెండు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్నారు.

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ, రైతుల మధ్య 11 దఫాలు చర్చలు జరిగాయి. కానీ, ఫలప్రదం కాలేదు. ఈక్రమంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా తమ ఆందోళనను తెలిపేందుకు రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారుతుందనే ఉద్దేశంతో తొలుత కేంద్రం ఆ ర్యాలీకి అనుమతి నిరాకరించించింది. ఆ తర్వాత కోర్టులో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తాము కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడబోమని రైతులు స్పష్టం చేశారు. ఈ రోజు కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రైతులు సెంట్రల్ ఢిల్లీలోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెట్రో రైళ్ల ప్రవేశద్వారాలను మూసివేశారు.

First published:

Tags: Farmers Protest, New Agriculture Acts

ఉత్తమ కథలు