అసలే హార్ట్ పేషెంట్.. కరెంటు బిల్లు రూపంలో భారీ షాక్.. ఏకంగా రూ.80కోట్ల బిల్లును చూసి.. చివరకు..

కరెంటు బిల్లును చూపుతున్న బాధితుడు

కరెంటు బిల్లును చూసిన ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. తన జీవితంలో కనీవినీ ఎరుగని మొత్తంలో కరెంటు బిల్లును చూడటంతో బీపీ ఎక్కువైపోయిన ఆ హార్ట్ పేషెంట్ ఆస్పత్రిలో పడ్డాడు. అసలేం జరిగిందంటే..

 • Share this:
  ఒక్కోసారి టెక్నికల్ ఎర్రర్స్ కొంపలు ముంచినంత పనిచేస్తాయి. గుండెలు అదిరేలా చేస్తాయి. ఇటీవల ఓ అమెరికా బ్యాంకు పొరపాటున కొన్ని వేల కోట్ల రూపాయలను ఖాతాదారుల అకౌంట్లోకి పంపించింది. ఆ తర్వాత వాటిని తిరిగి రప్పించుకునేందుకు నానా పాట్లు పడుతోంది. అలాగే టెక్నికల్ సమస్యల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వందల్లో వేలల్లో వచ్చే కరెంటు బిల్లులు కాస్తా లక్షల్లో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వినియోగదారులు గగ్గోలు పెట్టి సమస్యను అధికారుల ముందుకు తీసుకొస్తే వాటికి అప్పటికప్పుడు పరిష్కారాలు చూపిస్తారు. తాజాగా కరెంటు బిల్లును చూసిన ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. తన జీవితంలో కనీవినీ ఎరుగని మొత్తంలో కరెంటు బిల్లును చూడటంతో బీపీ ఎక్కువైపోయిన ఆ హార్ట్ పేషెంట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  మహారాష్ట్రలో నలసోపార్ నగరంలోని నిర్మల్ గ్రామంలో గణ్‌పత్‌ నాయక్‌ అనే 80 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు. అతడు స్థానికంగా రైస్ మిల్లు నడుపుతుంటాడు. ప్రతీ నెలలాగానే ఈ నెల కూడా మీటర్ రీడింగ్ తీసి కరెంటు బిల్లును ఇచ్చారు. అయితే ఆ బిల్లును చూసిన గణ్‌పత్‌కు గుండె ఆగిపోయినంత పనయింది. అప్పటికే హార్ట్ పేషెంట్ అయిన గణ్‌పత్‌కు బీపీ పెరిగిపోయి కుప్పకూలిపోయాడు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

  ఇది కూడా చదవండి: నా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. 54 రోజుల తర్వాత ట్విస్ట్.. బయటపడిన భార్య బండారం.. అసలేం జరిగిందంటే..

  ఇంతకీ ఆ కరెంటు బిల్లులో ఎంత చెల్లించాలని ఉందో తెలుసా..? అక్షరాలా 80 కోట్ల రూపాయలు. అంత మొత్తాన్ని అతడి జీవితంలోనే చూడలేదు. జీవితాంతం కష్టపడినా 80కోట్లు సంపాదించలేడు. అలాంటిది అంత మొత్తం ఎలా చెల్లించాలి? అని ఆవేదనతో ఆస్పత్రిపాలయ్యాడు. ఈ విషయం తెలిసిన విద్యుత్ అధికారులు స్పందించారు. టెక్నికల్ సమస్యల కారణంగా ఇలా బిల్లు వచ్చి ఉంటుందనీ, దీన్ని సరిచేస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గణ్‌పత్‌ ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
  ఇది కూడా చదవండి: కుర్రాళ్లూ.. మొదటిసారి శృంగారంలో పాల్గొనబోయే ముందు.. ఈ 5 టిప్స్ తెలుసుకుంటేనే బెటర్..!
  Published by:Hasaan Kandula
  First published: