హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నా భర్త మగాడు కాదు.. 'ఆడ'.. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత పోలీసులకు భార్య ఫిర్యాదు

నా భర్త మగాడు కాదు.. 'ఆడ'.. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత పోలీసులకు భార్య ఫిర్యాదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ మధ్యే తన భర్త గురించి సంచలన విషయాలు తెలిశాయని బాధితురాలు పేర్కొంది. అసలు అతడు పురుషుడే కాదని.. స్త్రీ అని చెప్పింది. ఆమె పేరు విజేత అని చెప్పింది. కానీ పురుషుడిగా చెప్పి..తనను పెళ్లి చేసుకొని.. మోసం చేశాడని వాపోయింది

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తన భర్త మగాడు కాదు 'ఆడ' అని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అది కూడా పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేసింది. అసలు తాను పెళ్లి చేసుకున్నది ఓ మహిళను అని.. ఇన్నాళ్లు అది తనకు తెలియలేదని వాపోయింది. గుజరాత్‌ (Gujarat)లోని వడోదరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వడోదారకు చెందిన 40 ఏళ్ల మహిళ బుధవారం గోత్రి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. తన భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త విరాజ్ వర్ధన్ తనను మోసం చేస్తున్నాడని.. అసలు అతడు పురుషుడే కాదని..స్త్రీ అని సంచలన ఆరోపణలు చేసింది. తనతో అసహజ శృంగారం చేస్తున్నాడని వాపోయింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

  Snake bite : యువకుడిపై పగబట్టిన పాము..10 రోజుల వ్యవధిలో 5సార్లు అక్కడే కాటు

  బాధితురాలికి 14 ఏళ్ల కూతురు ఉంది. 2011లో రోడ్డు ప్రమాదంలో ఆమె మొదటి భర్త మరణించాడు. ఆ తర్వాత ఓ మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా ఢిల్లీకిచెందిన విరాజ్ వర్ధన్‌తో పరిచయం ఏర్పడింది. అతడు ఢిల్లీ నుంచి వచ్చి వడోదరాలో స్థిరపడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో..2014 ఫిబ్రవరి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం కాశ్మీర్‌కు కూడా వెళ్లారు. కానీ వారి మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఏర్పడలేదు. ఏవేవో సాకులు చెబుతూ వచ్చాడు. తనతో ఎందుకు శృంగారంలో పాల్గొనడం లేదని ఆమె ఒత్తిడి చేయడంతో.. రష్యాలో తనకు ప్రమాదం జరిగిందని.. ఆ తర్వాత నుంచి శృంగారంలో పాల్గొనలేకపోతున్నాని చెప్పాడు. చిన్న సర్జరీ చేసుకుంటే సరిపోతుందని చెప్పాడు. అనంతరం 2020 జనవరిలో బరువు తగ్గించుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకుంటున్నానని చెప్పి.. కోల్‌కతా వెళ్లాడు. అక్కడ సర్జరీ పూర్తయ్యాక తిరిగి వడోదారకు వచ్చాడు. అప్పటి నుంచీ తనతో అసహజ శృంగారం చేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  ఈ మధ్యే తన భర్త గురించి సంచలన విషయాలు తెలిశాయని బాధితురాలు పేర్కొంది. అసలు అతడు పురుషుడే కాదని.. స్త్రీ అని చెప్పింది. ఆమె పేరు విజేత అని చెప్పింది. కానీ పురుషుడిగా చెప్పి..తనను పెళ్లి చేసుకొని.. మోసం చేశాడని వాపోయింది. కోల్‌కతాలో బరువు తగ్గే సర్జరీ చేయించుకోలేదని.. లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నాడని ఆరోపించింది. పురుషుడిగా చెప్పుకుంటూ..ఇన్నాళ్లు తనను మోసం చేసిన... విజేతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime, Crime news, Gujarat

  ఉత్తమ కథలు