Home /News /national /

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... మహారాష్ట్రలో 8 మంది మృతి

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... మహారాష్ట్రలో 8 మంది మృతి

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ధూలేలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 28 మందికి గాయాలయ్యాయి.

    మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ధూలేలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానికులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పేలుడు అనంతరం ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: BLAST, Maharashtra

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు