హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మృత్యు పొగమంచు: హైవేపై 50 వాహనాలు ఢీ..8 మంది మృతి

మృత్యు పొగమంచు: హైవేపై 50 వాహనాలు ఢీ..8 మంది మృతి

రోహ్‌తక్-రెవారి హైవేపై ప్రమాదం

రోహ్‌తక్-రెవారి హైవేపై ప్రమాదం

రోహ్‌తక్-రెవారీ హైవేపై 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.

దేశమంతటా చలిపులి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం తొమ్మిదైనా పొగమంచు పోకవడంతో..చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. హర్యానాలోని ఝాజర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోహ్‌తక్-రెవారీ హైవేపై 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఆదివారం నుంచి కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోయాయి. గురుగ్రామ్‌లో 1.4, హిస్సార్‌లో 2.7, రోహ్‌తక్‌లో 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో హర్యానా అంతటా మంచుదుప్పటి కప్పేసింది.

రెండు రోజుల క్రితం పంజాబ్‌లోనూ ఇలాంటి రోడ్డు ప్రమాదమే జరిగింది. రాజ్‌పురాలో 20 వాహనాలు పరస్పరం ఢీక్కోవడంతో..పలువురికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్-44పై గంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.

First published:

Tags: Haryana

ఉత్తమ కథలు