హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UP Accident: బస్సును ఎదురెదురుగా ఢీకొట్టిన ట్రక్కు.. 8 మంది ప్రయాణికులు దుర్మరణం

UP Accident: బస్సును ఎదురెదురుగా ఢీకొట్టిన ట్రక్కు.. 8 మంది ప్రయాణికులు దుర్మరణం

యూపీలో రోడ్డు ప్రమాదం

యూపీలో రోడ్డు ప్రమాదం

UP Accident: లఖింపూర్ ఖేరీ రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adtyanath)  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం  (UP Road Accident) జరిగింది. ప్రైవేట్ బస్సు, ట్రక్కు  ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది  మరణించారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని ఖమారియా బ్రడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో లక్నోకు షిఫ్ట్ చేశారు.

ప్రమాద సమయంలో బస్సు  ధోర్హారా నుంచి లక్నో వెళ్తోంది. బస్సులో 35-40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇషా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా బ్రిడ్జి వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న లారీ.. అతివేగంతో బస్సును ఢీకొట్టింది.  ఈ ఘటనలో ఆరుగురు  ప్రయాణికులు అక్కడికక్కడే ( Lakhimpur Kheri Accident) మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడ్డ వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

బెడిసి కొట్టిన దొంగల ప్లాన్.. వాచ్ మెన్ ఏంచేశాడో తెలుసా..?.. వీడియో వైరల్..

లఖింపూర్ ఖేరీ రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adtyanath)  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారు.

First published:

Tags: Road accident, Up news, Uttar pradesh

ఉత్తమ కథలు