పండుగ చేస్కోండి.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బొనాంజా ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది.

 • Share this:
  దసరా పండుగ మొదలైంది. మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ కూడా వస్తోంది. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బొనాంజా ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు రూ.10,000 అడ్వాన్స్ పొందవచ్చు. కేబినెట్ భేటీ అనంతరం విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ దీనికి అర్హులే. అలాగే, 2021 మార్చి 31 లోపు ఈ సౌకర్యాన్ని వారు వినియోగించుకోవచ్చు. ఈ స్కీమ్ కింద స్పెషల్ ఫెస్టివల్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10,000 మంజూరు చేస్తారు. దానికి ఎలాంటి వడ్డీ ఉండదు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి పండుగ స్పెషల్ ప్యాకేజీ సౌకర్యాన్ని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గఆ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అడ్వాన్స్ తీసుకునే సౌకర్యం ఉంది. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ అడ్వాన్స్ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తారు. మళ్లీ ఆ డబ్బులను తిరిగి చెల్లించడానికి అత్యధికంగా 10 వాయిదాలు అవకాశం ఇస్తారు. అంటే, ఈ పథకం కింద అడ్వాన్స్ తీసుకున్నవారు 10 ఇన్‌స్టాల్ మెంట్లలో రూ.10,000 తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

  ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద ప్రతి ఉద్యోగికి రూ.10,000 అడ్వాన్స్ ఇస్తుంది. ఈ అడ్వాన్స్‌ను పది ఇన్‌స్టాల్‌మెంట్లలో తిరిగి తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.4000 కోట్లు కేటాయించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం వల్ల సుమారు 48 లక్షల మందికి లబ్ది జరగనుంది.

  ఈ ఏడాది జూలైలో మోదీ ప్రభుత్వం నైట్ డ్యూటీ అలవెన్స్ నిబంధనల్ని మార్చింది. 7వ పే కమిషన్ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్-DoPT నైట్ డ్యూటీ అలవెన్సుల విషయంలో కొత్త నియమనిబంధనల్ని జారీ చేసింది. ప్రస్తుతం నైట్ డ్యూటీ అలవెన్సుల విషయంలో ఉద్యోగులు అందరికీ గ్రేడ్ పే ద్వారా అలెవన్సులు ఇస్తున్న విధానానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కొత్త నియమనిబంధనలు 2017 జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. కొత్త నియమనిబంధనల ప్రకారం నైట్ వెయిటేజీని పరిగణలోకి తీసుకుంటే ఇక పనిగంటలు లెక్కలోకి రావు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వహిస్తేనే నైట్ డ్యూటీగా పరిగణిస్తారు. నైట్ డ్యూటీ అలవెన్సుల కోసం బేసిక్ వేతనం పరిమితి రూ.43,600 అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్-DoPT వెల్లడించింది. నైట్ డ్యూటీ చేసే ఉద్యోగులకు ప్రతీ గంటకు 10 నిమిషాల చొప్పున వెయిటేజీ ఉంటుంది. నైట్ డ్యూటీ అలవెన్స్ గంటకు బేసిక్ పే+డీఏ/200 చొప్పున లెక్కిస్తారు. నైట్ డ్యూటీ అలవెన్సులకు లెక్కించే బేసిక్ పే, డీఏ 7వ పే కమిషన్ సూచించిన ప్రకారం ఉంటాయి. ఈ ఫార్ములా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. నైట్ డ్యూటీ చేసే సంబంధిత ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా ప్రతీ ఉద్యోగికి వేర్వేరుగా నైట్ డ్యూటీ అలవెన్సును లెక్కిస్తుంది ప్రభుత్వం.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: