Central Govenment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఫలాలు వారికి కూడా.. 

ప్రతీకాత్మక చిత్రం

Central Govenment: కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం మరో శుభవార్త చెప్పింది. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, గ్రాట్యూటీ, డియర్‌నెస్‌ అలవెన్స్‌ వంటి ప్రయోజనాలన్నీ అందించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

  • Share this:
కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏడో వేతన(7th Pay commission) సంఘం మరో శుభవార్త చెప్పింది. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, గ్రాట్యూటీ, డియర్‌నెస్‌ అలవెన్స్‌ వంటి ప్రయోజనాలన్నీ అందించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌-19 సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. రిటైరైన చాలా మంది ఉద్యోగుల ఆశలపై మహమ్మారి నీళ్లు చల్లింది. కొవిడ్‌ సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఈ ఏడాది ప్రథమార్ధం వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపును నిలుపుదల చేసింది.

ఆ కారణంగా చాలా మంది ఉద్యోగుల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌లో కోత పడింది. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ ఉద్యోగులు తమకు కోతపడిన ప్రయోజనాన్ని తిరిగి పొందనున్నారు. జనవరి 1, 2020 నుంచి జూన్‌ 30, 2021 మధ్య రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యూటీ, డియర్‌నెస్‌ అలవెన్స్‌ విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

Huzurabad By Elections: టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ ఇదేనా.. అందుకే వాళ్లతో ఇలా చేస్తున్నారా..?


ఈ పద్దెనిమిది నెలల కాలంలో రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యూటీ లెక్కింపు విషయంలో డియర్‌ అలవెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వివరణ ప్రకటన జారీ చేసింది. లెక్కింపులో తేడా కారణంగా ఆ ఉద్యోగుల రిటైర్మెంట్‌ ప్రయోజనాలు తగ్గాయి. ఈ విషయాన్ని సానుభూతితో పరిశీలించిన ప్రభుత్వం ఆ ఉద్యోగులకు ఆ మేరకు ప్రయోజనాలు చేకూర్చేందుకు తాజాగా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

కోవిడ్‌-19 కారణంగా ఆ పద్దెనిమిది నెలల కాలంలో ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌, పెన్షనర్లకు డియర్‌నెస్‌ రిలీఫ్‌ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. కానీ ఆ కాలానికి సంబంధించిన పెంపును తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. కానీ అప్పటికే రిటైరైన ఉద్యోగులకు 17 శాతం డీఏ చొప్పునే రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అందాయి. ఈ లోపాన్ని సవరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ 18 నెలల కాలంలో రిటైరైన ఉద్యోగులు కూడా పెంచిన డీఏ ప్రయోజనాలు పొందగలుగుతారు.

Job Mela: పది, ఇంటర్, డిగ్రీ పాసైన నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 2500 ఖాళీలకు ఇంటర్వ్యూలు.. వివరాలిలా..


ఈ ఆదేశాల ప్రకారం జనవరి 1, 2020 నుంచి 30 జూన్‌, 2020 మధ్య రిటైరైన ఉద్యోగులకు 21 శాతం డీఏను పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే జూలై 1, 2020 నుంచి డిసెంబర్‌ 31, 2020 మధ్య కాలంలో రిటైరైన ఉద్యోగులకు డీఏను 24 శాతంగా లెక్కిస్తారు. జనవరి 1, 2021 నుంచి జూన్‌ 30, 2021 మధ్య కాలంలో రిటైరైన ఉద్యోగులకు డీఏను 28 శాతంగా లెక్కిస్తారు. అయితే గ్రాట్యూటీ లెక్కింపు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ కోసం మాత్రమే ఈ పెరిగిన డీఏ వర్తిస్తుంది.
Published by:Veera Babu
First published: