7th pay commission: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు... డీఏ పెంపు?

7th pay commission: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు... డీఏ పెంపు?

7th Pay Commission Latest News: దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్న సమయంలో... ఏడో వేతన చెల్లింపుల సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.

  • Share this:
    7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త సంవత్సరం కలిసి రాబోతోంది. ఏడో వేతన చెల్లింపుల సంఘం వారికి ఓ శుభవార్త చెప్పింది. కరోనా కష్టాలను దృష్టిలో పెట్టుకొని జనవరి నుంచి ఉద్యోగుల శాలరీల్లో పెంపు ఉండబోతున్నట్లు తెలిసింది. మీడియా రిపోర్టుల ప్రకారం... జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరవు బత్యం (Dearness Allowance - DA)లో 4 శాతం అదనంగా పొందనున్నట్లు సమాచారం. ఆ రిపోర్టుల ప్రకారం... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు... తమ పెండింగ్ బత్యాల కోసం జూన్ దాకా ఆగాల్సిన పని లేదు. ఈ 4 శాతం పెంపును ఏడో వేతన చెల్లింపుల సంఘం... ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఫార్ములాను అనుసరించే పెంపును ప్రతిపాదించినట్లు తెలిసింది.

    మార్చి 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఏర్పాటైంది. జనవరి 1, 2021 నుంచి అదనపు డీఏతోపాటూ... పెన్షనర్లకు ఉపశమన బత్యం (Dearness Relief -DR) ఇచ్చేందుకు అదనపు నిధులను విడుదల చేసే ప్రతిపాదనను ఆమోదించింది. తాజా రిపోర్టుల ప్రకారం ఇప్పుడు బేసిక్ పే/పెన్షన్‌ కి ఇస్తున్న 17 శాతానికి అదనంగా మరో 4 శాతం కలపబోతున్నట్లు తెలిసింది. ఇందుకు ప్రధాన కారణం దేశంలో వస్తువుల ధరలు పెరగడమేనని తెలిసింది. ఇలా ధరలు పెరుగుతున్న విషయాన్ని ఆర్థిక శాఖ ఇంతకుముందే కేంద్రం దృష్టికి తెచ్చింది.

    కొన్ని కీలక అంశాలు:
    - డీఏ, డీఆర్ రెండూ కలిపి... సంవత్సరానికి రూ.12,510.04 కోట్లు మాత్రమే ఉండాలనీ, అలాగే... 2020-2021 ఆర్థిక సంవత్సరంలో అది రూ.14,495.04 కోట్లు మాత్రమే ఉండాలని కేంద్రం ఫిక్స్ చేసింది.
    - ఆర్థిక సంవత్సరం అంటే జనవరి 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు మొత్తం 14 నెలలను లెక్కలోకి తీసుకుంది.
    - ఈ పెంపు అమల్లోకి వస్తే... దేశవ్యాప్తంగా 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది.




    ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సేవల నుంచి వైకల్యం కారణంగా దూరమై... సర్వీస్ కాలం ఉన్న వారికి... వైకల్య పరిహారం (disability compensation) ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందుకు సంంధించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గత శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం వల్ల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF), CRPF, BSF, CISF వారికి మేలు జరగనుంది.

    ఇది కూడా చదవండి: Milk Health Tips: ఈ ఐదింటినీ పాలతో కలిపి తీసుకోకండి... ఆరోగ్యానికి ప్రమాదం

    మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిశ్చింతగా ఉండేలా... ఆర్థిక సమస్యల నుంచి బయటపడేలా చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
    Published by:Krishna Kumar N
    First published: